Telangana

News September 2, 2024

HYD: ప్రయాణాలు చేసేవారికి ALERT

image

భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లాలనుకునే నగర ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని HYD ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితిలో సహాయానికి హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్ సంప్రదించాలన్నారు.

News September 2, 2024

HYD: పసి పిల్లలను పొట్టనబెట్టుకుంటున్నారు..!

image

ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పెద్దలు కుటుంబాలను చిదిమేస్తున్న ఘటనలు HYDలో పెరుగుతున్నాయి. జీడిమెట్ల పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో నష్టపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పటాన్‌చెరులోని రుద్రారంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరపెడుతోంది.

News September 2, 2024

HYD: పసి పిల్లలను పొట్టనబెట్టుకుంటున్నారు..!

image

ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పెద్దలు కుటుంబాలను చిదిమేస్తున్న ఘటనలు HYDలో పెరుగుతున్నాయి. జీడిమెట్ల పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వెంకటేష్ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లో నష్టపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పటాన్‌చెరులోని రుద్రారంలో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలవరపెడుతోంది.

News September 2, 2024

శాంతించిన మున్నేరు.. భారీగా తగ్గిన వరద

image

ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసిన మున్నేరు వరద కాస్త శాంతించింది. నిన్న వాగు సామర్థ్యం కంటే అత్యధికంగా వరద పెరిగి 36 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో పరీవాహక ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. తాజాగా నీటిమట్టం 23.50 అడుగులకు చేరింది. సుమారు 12 అడుగులు మేర తగ్గింది. 

News September 2, 2024

జాతీయ సాధన సర్వే నిధులు విడుదల

image

విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్లకోసారి జాతీయ సాధన సర్వే (న్యాస్) నిర్వహిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 3, 6, 9 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయిలో ఈ ఏడాది నవంబరు 19న ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు మాదిరి పరీక్షల కోసం ఉమ్మడి జిల్లాకు రూ.4,72,160 లక్షలు మంజూరయ్యాయి.

News September 2, 2024

ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల అవస్థలు

image

ఉస్మానియాలో వివిధ విభాగలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసియేట్లు, డైటీషియన్, ఆర్ఎంవోలను రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రులకు బదిలీ చేశారు. దీంతో సరైన వైద్యులు, సిబ్బంది లేక రోగులకు అవస్థలు పడుతున్నారు. వారి స్థానంలో కొంత మందిని ఇక్కడకు బదిలీ చేసినా.. ఆసుపత్రిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పడకల్లేక రోగులు నేలపైనే చికిత్సలు పొందుతున్నట్లు చెబుతున్నారు.

News September 2, 2024

పటాన్‌చెరు: దంపతుల మధ్య గొడవ.. భార్య సూసైడ్

image

వాషింగ్‌ మెషీన్‌ బాగు చేయించలేదన్న కోపంతో భార్య సూసైడ్ చేసుకున్న ఘటన రామచంద్రాపురంలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన సంగీత ప్రియ(30) భర్త రాజ్‌కుమార్‌తో కలిసి BHEL సైబర్‌ కాలనీలో ఉంటుంది. వాషింగ్‌ మెషీన్‌కు రిపేర్ చేయించలేదని, ఇంట్లోకి సరకులు లేవని శనివారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. భర్తపై కోపంతో బెడ్ రూంలోకి వెళ్లిన సుప్రియ డోర్ తీయకపోవడంతో పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొంది.

News September 2, 2024

BIGBOSSలోకి వరంగల్ యువకుడు

image

ప్రముఖ రియలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 ఆదివారం మొదలైంది. ఇందులో వరంగల్‌కు చెందిన నబీల్ అఫ్రిది చోటు దక్కించుకున్నాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంతే ఇష్టం. కాగా, నబీల్ వరంగల్ డైరీస్ యూట్యూజ్ ఛానల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

News September 2, 2024

రాష్ట్రస్థాయి టాపర్‌గా దుబ్బాక విద్యార్థి

image

ఇంటర్‌ 2022-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్‌ కోర్సులో రాష్ట్రస్థాయి టాపర్‌గా దుబ్బాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి దోర్నాల సుకుమార్‌ నిలిచాడు. ఒకేషన్‌ కోర్సులో సుకుమార్‌ ఈటీ (ఎలక్ట్రీషియన్‌ టెక్నీషియన్‌) చేశాడు. ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 994 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి టాపర్‌గా నిలిచాడు. ఈనెల 4న హైదరాబాద్‌లో ఇంటర్‌ బోర్డు రాష్ట్ర స్థాయి టాపర్లకు నగదు పారితోషికం, అవార్డు అందజేయనున్నారు.

News September 2, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా మెదక్, సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రులు, అధికారులు హెచ్చరించారు. రేపు కూడా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.