India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుంది. గతంలో నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండేది కాదు. కానీ ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. ఎగ్జామ్ హాలులోకి అనుమతి ఇస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమాన్ని పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేస్తున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహిస్తామన్నారు.
మంచిర్యాలలోని లక్ష్మీ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న వహిదా అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. సోమవారం తలనొప్పి ఉన్నట్లు ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోలేదని, పరిస్థితి విషమించడంలో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం HYDలోని నిమ్స్‌కి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొనిజర్లలో జరిగింది. కొణిజర్ల నుంచి మల్లుపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మల్లుపల్లికి చెందిన ఉపేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ పదవుల్లో NZB జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు పొందారు. అనిల్ ఈరవత్రి (మినరల్ డెవలప్‌మెంట్), మానాల మోహన్ రెడ్డి(కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), అన్వేశ్ రెడ్డి(సీడ్స్ డెవలప్‌మెంట్). వీరితో పాటు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజు (ఆర్గో ఇండస్ట్రీస్) లభించింది.
HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్‌లో జోష్ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూనే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.
HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్‌లో జోష్ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూనే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని మాత దర్శనానికి పోటెత్తారు. అదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి తలనీలాలు సమర్పించి, వనదుర్గ భవాని మాతకు ఓడి బియ్యం పోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఛైర్మన్ బాల గౌడ్, ఈఓ మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండపురిలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న రోజు మాదిరి కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
కోడేరు మండలం రాజాపూర్‌లో <<12867361>>భార్య గొంతుకోసి భర్త సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. తుర్కదిన్నెకు చెందిన శివశంకర్, భారతిని 2వ పెళ్లి చేసుకొని HYDలో ఉంటున్నాడు. 3నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భారతిని కాపురానికి రావాలని ఫోన్లో అడగ్గా రాకపోవడంతో నిన్న రాజాపూర్ వెళ్లాడు. అత్తమామలు బయటకు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు గొడవ పడి భారతి గొంతు కోసేశాడు. అనంతరం వెళ్లి తన పొలంలో ఉరేసుకున్నాడు. భారతి 6నెలల గర్భిణి.
Sorry, no posts matched your criteria.