Telangana

News March 18, 2024

HYD: నేటి నుంచి జూన్ 4 వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్లు

image

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్, శశాంక, నారాయణరెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. SHARE IT

కరీంనగర్: 144 సెక్షన్ అమలు

image

పదో తరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేది వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. KNR జిల్లా వ్యాప్తంగా 219 సెంటర్లు ఏర్పాటు చేయగా, 38,097 మంది పరీక్ష రాయనున్నారు.

News March 18, 2024

NGKL: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

బిజినేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వీపనగండ్ల మండల వాసి బాలకృష్ణ HYD వైపు బైక్‌పై వెళ్తున్నాడు. మరో బైక్‌పై సూర్యాపేట జిల్లాకు చెందిన అజయ్‌, సిద్దార్థ్‌, భరత్‌ ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో సిద్దార్థ్‌ అక్కడిక్కడే మృతిచెందగా గాయపడ్డ మరో ముగ్గురిని నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

News March 18, 2024

HYD: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: లక్ష్మణ్

image

రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని MP లక్ష్మణ్ విమర్శించారు. HYDలో ఆదివారం నిర్వహించిన అడ్వకేట్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నామ మాత్రంగా పథకాలను ప్రారంభిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, అందుకు అనుగుణంగా మేనిఫెస్టో తయారుచేసేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు.

MDK: పోటీ పరీక్షలకు సిద్ధమవుతోన్న నిరుద్యోగులు

image

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రూప్‌-2, గ్రూప్‌-3, డీఎస్సీ, టెట్‌, హాస్టల్‌ వార్డెన్‌ నోటిఫికేషన్లు రావడంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు సుమారు 7లక్షల మంది ఉన్నట్లు సమాచారం.

News March 18, 2024

NZB: జంట హత్యలు.. నిందితుడు సూసైడ్

image

ఆర్మూర్‌లోని విద్యానగర్ కాలనీలో చేపూర్ గ్రామానికి చెందిన బండి నడిపి గంగాధర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గతంలో నగల కోసం ఇద్దరూ అక్కాచెల్లెళ్లను హతమార్చిన ఘటనలో నిందితుడు కావడం విశేషం. మృతుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అప్పటినుంచి మతిస్థిమితం లేదని మృతుడి బంధువులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

News March 18, 2024

KMM: చెవి దుద్దులు కొనివ్వలేదని.. భర్తకు నిప్పంటించింది!

image

చెవి దుద్దులు కొనివ్వడం లేదని భర్తకు భార్య నిప్పంటించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట కాలనీలో నివసించే షేక్ యాకూబ్ పాషా, సమీనా దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. భార్య షమీనా భర్తను చెవి దిద్దులు కొనివ్వాలి అడగడంతో భర్త నిరాకరించారు. కోపంతో సమీనా భర్తకు నిప్పంటించింది. వెంటనే స్థానికులు పాషాను ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై ఉదయ్ కుమార్ కేసు నమోదు చేశారు.

News March 18, 2024

HYD: మతం పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న BJP: కూనంనేని

image

పార్లమెంట్‌ ఎన్నికల్లో BJP మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. HYD శంషాబాద్‌ పట్టణంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడారు. BJPపై ఫైర్ అయ్యారు.