Telangana

News March 17, 2024

ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ సిక్తా పట్నాయక్

image

ప్రజావాణి కార్యక్రమాన్ని పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపి వేస్తున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహిస్తామన్నారు.

News March 17, 2024

మంచిర్యాల: ప్రిన్సిపల్ నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి

image

మంచిర్యాలలోని లక్ష్మీ నగర్‌లో ఉన్న తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్న వహిదా అనే అమ్మాయి చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. సోమవారం తలనొప్పి ఉన్నట్లు ప్రిన్సిపల్‌కి చెప్పినా పట్టించుకోలేదని, పరిస్థితి విషమించడంలో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. మెరుగైన చికిత్స కోసం HYDలోని నిమ్స్‌కి తరలించగా ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News March 17, 2024

కొణిజర్లలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి

image

ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొనిజర్లలో జరిగింది. కొణిజర్ల నుంచి మల్లుపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మల్లుపల్లికి చెందిన ఉపేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 17, 2024

NZB: నలుగురు కాంగ్రెస్ నాయకులకు కార్పొరేషన్ పదవులు

image

కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ పదవుల్లో NZB జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవులు పొందారు. అనిల్ ఈరవత్రి (మినరల్ డెవలప్‌మెంట్), మానాల మోహన్ రెడ్డి(కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), అన్వేశ్ రెడ్డి(సీడ్స్ డెవలప్‌మెంట్). వీరితో పాటు కామారెడ్డి జిల్లా నుంచి కాసుల బాలరాజు (ఆర్గో ఇండస్ట్రీస్) లభించింది.

News March 17, 2024

హైదరాబాద్‌లో బలపడుతున్న కాంగ్రెస్..!

image

HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్‌ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్‌లో జోష్‌ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్‌ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూ‌నే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

News March 17, 2024

హైదరాబాద్‌లో బలపడుతున్న కాంగ్రెస్..!

image

HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్‌ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్‌లో జోష్‌ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్‌ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూ‌నే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

News March 17, 2024

ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి బారులు దీరారు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని మాత దర్శనానికి పోటెత్తారు. అదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి తలనీలాలు సమర్పించి, వనదుర్గ భవాని మాతకు ఓడి బియ్యం పోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఛైర్మన్ బాల గౌడ్, ఈఓ మోహన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

News March 17, 2024

సూర్యాపేట: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండపురిలో ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాలకుర్తి వెంకన్న రోజు మాదిరి కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News March 17, 2024

NGKL: కాపురానికి రావట్లేదని భార్యను చంపేశాడు

image

కోడేరు మండలం రాజాపూర్‌లో <<12867361>>భార్య గొంతుకోసి భర్త సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. తుర్కదిన్నెకు చెందిన శివశంకర్‌, భారతిని 2వ పెళ్లి చేసుకొని HYDలో ఉంటున్నాడు. 3నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన భారతిని కాపురానికి రావాలని ఫోన్లో అడగ్గా రాకపోవడంతో నిన్న రాజాపూర్ వెళ్లాడు. అత్తమామలు బయటకు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు గొడవ పడి భారతి గొంతు కోసేశాడు. అనంతరం వెళ్లి తన పొలంలో ఉరేసుకున్నాడు. భారతి 6నెలల గర్భిణి.

News March 17, 2024

ఖమ్మం : మట్టి కుండలకు భలే డిమాండ్

image

ఎండలు మండిపోతుండడంతో ప్రజలు చల్లని నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ లో నీటిని తాగడంతో అనేక సమస్యలు తలెత్తుతుండడంతో ఆరోగ్యం కోసం మట్టికుండల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఫ్రిడ్జ్ లు, వాటర్ కూలర్ కొనుగోలు చేయలేని పేదలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు నగరంలోని ప్రధాన వీధుల్లో వ్యాపారులు పలు రకాల కుండలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.