Telangana

News September 2, 2024

గ్రేటర్‌లో నిధులు నిల్.. కదలని అభివృద్ధి పనులు

image

గ్రేటర్‌లో అత్యవసర పనులు తప్ప కొద్ది నెలలుగా ఇతర అభివృద్ధి జరగట్లేదు. కాలనీ రోడ్లు, నాలాలు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ఇలా చాలా పనులు ఆటకెక్కాయి. కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. నాలాల పూడికతీత, నిర్మాణ పనులు సవ్యంగా జరగకపోవడంతో వర్షాకాలం ముంపు తిప్పలు తప్పడం లేదు. జీహెచ్ఎంసీకి సర్కారు నుంచి వేర్వేరు రూపాల్లో రూ.8వేల కోట్లు రావాలి.

News September 2, 2024

నేడు ప్రజావాణి రద్దు: కలెక్టర్లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 2న నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండలాల్లో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు అత్యవసర విధులలో ఉన్నందున రద్దు చేస్తున్నామని, మరో 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

News September 2, 2024

పాలమూరు బిడ్డకు BRICS యువజన సదస్సుక ఆహ్వానం

image

ఈనెల 3నుండి 6వ తేదీ వరకు సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్ బర్గ్ లో జరిగే బ్రిక్స్ యూత్ అసోసియేషన్ విద్యా సదస్సుకు భారత్ నుంచి నారాయణపేట జిల్లా మరికల్ కు చెందిన న్యాయవాది అయ్యప్ప ఎంపికైనట్లు బ్రిక్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేమండ్ తెలిపారు. ఈ సదస్సులో బ్రిక్స్ దేశాల సాంస్కృతిక, ఆర్థిక, విద్యా విజ్ఞానిక నూతన ఆవిష్కరణలను గురించి చర్చలు జరుగుతాయని భారత్ నుండి 6 మందిని ఈ సదస్సుకు ఎంపిక చేశామన్నారు.

News September 2, 2024

NLG: 498 ఎకరాల్లో నీట మునిగిన పంట

image

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 4 మండలాల్లో 498ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. వాడపల్లిలో పత్తి 20 ఎకరాలు, వరి 100 ఎకరాలు, మాడ్గులపల్లి మండలం కాల్వపల్లిలో వరి 2 ఎకరాలు, వేములపల్లి, శెట్టిపాలెం, రావుల పెంటలో 350 ఎకరాల్లో వరి, గుర్రంపోడు మండలం రేపల్లెలో మిరప 3 ఎకరాలు, పెద్దవూరలోని చలకుర్తిలో 3 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు తెలిపారు.

News September 2, 2024

కొప్పోల్ ఉమా సంగమేశ్వర ఆలయంలో కాశిబుగ్గ.. పూజలు

image

పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోల్ శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో కాశిబుగ్గ(నీరు) రావడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమా సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి ప్రత్యేకంగా నీరు రావడాన్ని భక్తులు కాశిబుగ్గగా పేర్కొంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పదేళ్ల తర్వాత తాజాగా ఆదివారం కాశిబుగ్గ రావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు.

News September 2, 2024

ఖమ్మం: నేడు విద్యాసంస్థలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

News September 2, 2024

పెద్దపల్లి: 24 గంటల పాటు కంట్రోల్ రూం ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ఆపద, ఇతర ఇబ్బందులు వస్తే కలెక్టరేట్ కంట్రోల్ రూం నెంబర్ 1800 599 5459కు కాల్ చేయాలన్నారు. 24 గంటల పాటు పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.

News September 2, 2024

కేసముద్రం: రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో కేసముద్రం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ-వరంగల్ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది త్వరితగతిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

News September 2, 2024

ఖమ్మం: వరదల్లో ఐదుగురు మృత్యువాతపై ఎంపీ విచారం

image

వరదలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ప్రజల్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నేరు నది పోటెత్తడంతో కనీవినీ ఎరుగని వరదల వల్ల ఐదుగురు మృత్యువాత పడడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖమ్మంలో వందలాది ఇల్లు ముంపునకు గురై ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు.

News September 2, 2024

MBNR: రూ.13కోట్లతో సిద్ధమవుతున్న సింథటిక్ ట్రాక్!

image

PUలో 2 ఎకరాల స్థలంలో పరుగు మార్గం (సింథటిక్ ట్రాక్) ఏర్పాటు చేశారు. 800 Mts,100Mts పరుగు పోటీలకు అనుగుణంగా నిర్మించారు. మార్గంలో 8 మంది క్రీడాకారులు సమాంతరంగా పరిగెత్తే వీలుంది. 2023లో కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా పథకం’ కింద పరుగు మార్గం నిర్మాణానికి రూ.9 కోట్లు, రూ.4 కోట్లతో చేపట్టే క్రీడాకారులు దుస్తులు మార్చుకునే 6 గదులు, ప్రేక్షకులు కూర్చునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు.