Telangana

News September 1, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన *NZB, KMR ప్రాజెక్టులకు పోటెత్తిన వరద *NZB రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి *KMR డెంగ్యూతో వ్యక్తి మృతి *ACBకి పట్టుబడ్డ ఇన్‌ఛార్జ్ అర్వో నరేందర్ సస్పెండ్ *బిక్కనూర్ వరద నీటిలో చిక్కిన వారిని కాపాడిన పోలీసులు *డిచ్పల్లి: వివాహితది ఆత్మహత్య కాదు.. హత్య *బాన్సువాడ ప్రేయసిన హత్య చేసిన ప్రియుడు.

News September 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు.
@ మేడిపల్లి, కోరుట్ల మండలంలో పర్యటించిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్లు.
@ భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల, జగిత్యాలలో రేపు జరగనున్న ప్రజావాణి రద్దు.
@ జగిత్యాల జిల్లాలో 215 డెంగీ కేసులు నమోదు.
@ మెట్పల్లి పట్టణంలో విరిగిపడిన చెట్టు.. తప్పిన ప్రమాదం.

News September 1, 2024

ADB: ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు గడువు పొడగింపు

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై గడువు పొడగించినట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని, AUG 31 వరకు గడువు పూర్తవగా దాన్ని SEP 30 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 1, 2024

తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్ల ఎత్తివేత

image

చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో ఆదివారం 25 గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ గోదావరి విడుదల చేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడి ప్రాజెక్టులో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ సైతం వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 44,700 క్యూ సెక్కుల మేర వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 40,962 క్యూసెక్కుల మేర గోదావరికి విడుదల చేస్తున్నారు.

News September 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒రేపు ప్రజావాణి రద్దు:కలెక్టర్లు
✒ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు.. పలుచోట్ల రాకపోకలు బంద్
✒NGKL:వాగులో వ్యక్తి గల్లంతు.. కాపాడిన పోలీసులు
✒మద్దూర్:భారీ వర్షాలు..తల్లీకూతురు మృతి
✒NMMS స్కాలర్ షిప్ గడువు పొడగింపు
✒ప్రజలు జాగ్రత్తగా ఉండాలి:SIలు
✒MBNR:రెడ్ అలర్ట్.. రేపు భారీ వర్షాలు
✒రేపు పాఠశాలలకు సెలవు:DEOలు
✒మహమ్మదాబాద్: రేపు సీతాఫలాల సేకరణ వేలం!

News September 1, 2024

సిద్దిపేట: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పోన్నం

image

భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ సూచించారు. నిన్నటి నుంచి జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ తదితర అన్ని శాఖల అధికారులతో ఆదివారం ఫోన్ ద్వారా అప్రమత్తం చేశారు.

News September 1, 2024

‘ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం’

image

తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నరకయాతన పడుతున్నారని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. మేమున్నాం మీకేం కాదనే ధైర్యాన్ని వారికి ఇవ్వాలని అధికారులను, నాయకులను కోరారు. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులతో కలిసి సమన్వయం చేయాలని సూచించారు. జిల్లాలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

News September 1, 2024

సూర్యాపేట: వరదలో చిక్కుకున్నారు.. పోలీసులు కాపాడారు..!

image

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో ఓ పౌల్ట్రీ ఫాం జలదిగ్బంధమైంది. ఆ పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే కూలీలు వరదలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది.. ఏఎస్పీ నాగేశ్వర్ రావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో కూలీలను రెస్క్యూ చేసి కాపాడారు. బాధిత కూలీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులకు వారు థ్యాంక్స్ చెప్పారు. 

News September 1, 2024

MBNR: మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ నివాసంలో ఆదివారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తేనీటి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

News September 1, 2024

HYD ప్రజలకు ALERT: రాచకొండ సిపి

image

HYDలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చేపట్టిన పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, SPలతో ఆదివారం రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, DGP జితేందర్‌లతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.