Telangana

News September 1, 2024

యాదాద్రి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్

image

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా యాదాద్రి జిల్లాలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ హనుమంత్ తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్థానిక మండల తహసీల్దార్‌ను, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08685-293312 ఏర్పాటు చేశామన్నారు.

News September 1, 2024

SRPT: రేపు ప్రజావాణి రద్దు: అదనపు కలెక్టర్ లత

image

అధిక వర్షాల కారణంగా రేపు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ బీయస్ లత తెలిపారు. భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యలు నిమగ్నం అయినందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అన్నారు. ఈ నెల 9న సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.

News September 1, 2024

రేపు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అన్ని కాలేజీలకు సెలవు

image

భారీ వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకొని కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో సోమవారం అన్ని యూనివర్సిటీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ మల్లారెడ్డి తెలిపారు. అదేవిధంగా అన్ని డిగ్రీ, పిజి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది పరీక్షల నియంత్రణ అధికారి ద్వారా తెలియజేస్తామన్నారు.

News September 1, 2024

జేఎన్టీయూ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

image

జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో రేపు జరగబోయే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో రేపు జరగాల్సిన ఎంబీఏ, బీటెక్ సప్లిమెంటరీ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను 5వ తేదీన మళ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

News September 1, 2024

ప్రతి మండలానికి ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: మంత్రి సీతక్క

image

2022, 2023లో వచ్చిన జంపన్న వాగు వరదలను, వాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం వరదల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే ప్రతి మండలానికి ఫ్లడ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. రెండు నెలల ముందే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తుగా అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి సీతక్క అన్నారు.

News September 1, 2024

బాన్సువాడ: ప్రేమించిన అమ్మాయిని హత్య చేసిన ప్రియుడు

image

నర్సు కేసును బాన్సువాడ పోలీసులు చేదించారు. టౌన్ సీఐ కృష్ణ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. బీర్కూర్ మండలం బరంగెడ్దికి చెందిన మమత, ప్రశాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని మమత ఒత్తిడి తేవడంతో ప్రశాంత్ గురువారం ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. అతడిపై కేసు నమోదు చేశామన్నారు.

News September 1, 2024

ఖమ్మం: అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం

image

ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News September 1, 2024

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ కావ్య

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఆదివారం వరంగల్ నగరంలోని బీఆర్ నగర్, బృందావన్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, పద్మా నగర్, సాయి గణేశ్ కాలనీలో క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 1, 2024

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు: మంత్రి పొన్నం

image

భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు ఎప్పటికి అప్పుడు వరద పరిస్థితిని సమీక్షి స్తున్నారన్నారు. ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు.

News September 1, 2024

హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేస్తుంది: కొప్పుల

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో ఆయన విలేఖరుల సమవేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణ మాఫీ చేశామని చెబుతున్నా.. అది పూర్తి స్థాయిలో జరగలేదని మండిపడ్డారు.