Telangana

News March 16, 2024

పర్వతగిరిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులోతు తండాలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్న(28) తన ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంకన్నకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ వెంకన్న తెలిపారు.

News March 16, 2024

MDK: విషాదం.. రైతు మృతి

image

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొంగల లక్ష్మయ్య(55) శనివారం తన వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు వేసేందుకు వెళ్లాడు. స్టార్టర్ నడవకపోవడంతో దానిని రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

News March 16, 2024

హుజూరాబాద్‌లో కనిపించని నిరసన!

image

ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నా హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా నిరసనలు కనిపించడం లేదు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు స్తబ్ధుగా ఉండటంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

News March 16, 2024

HYD: ఎంపీ ఎన్నికలు.. పార్టీల సర్వేలు

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో సర్వేలు కొనసాగిస్తున్నాయి. HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉండటం గమనార్హం. IVR కాల్స్ ద్వారా ఓటర్ల మద్దతు తెలుసుకునేందుకు పలువురు సర్వే పనిలో పడ్డారు. వారం రోజుల నుంచి వాయిస్ కాల్స్ కూడా పెద్దఎత్తున వస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు.

HYD: ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయి: ఒవైసీ

image

దేశంలోని ముస్లింలపై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా ఆయన చార్మినార్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, యాముల్ ఖురాన్ పఠనం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం చేస్తున్న అభివృద్ధి పనులపై వివరించారు.

నాగర్‌కర్నూల్ ప్రజలు బీజేపీని గెలిపించాలి: మోదీ

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NGKLలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్‌కర్నూల్ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. BRS పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు.

News March 16, 2024

HYD: ఏసీబీ వలలో జలమండలి అధికారులు

image

రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.