Telangana

News September 1, 2024

సంగారెడ్డి: రుద్రారంలో విషాదం

image

పటాన్ చెరు మండలం రుద్రారంలో విషాదం చోటుచేసుకుంది. రుద్రారంలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తర్వాత తల్లి ఉరి వేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పటాన్ చెరు పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు పరిశీలిస్తున్నారు.

News September 1, 2024

HYD: గ్రేటర్లో 81.21 లక్షలకు తాకిన వాహనాల సంఖ్య!

image

గ్రేటర్ HYD పరిధిలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుంది. జులై నాటికి ఏకంగా గ్రేటర్ రోడ్ల పై 81.21 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9,103 కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా.. వాహనాల పెరుగుదలకు తగ్గట్లు రోడ్ల వ్యవస్థ సరిగ్గా అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

News September 1, 2024

నడిగూడెం వరద పరిస్థితులను పరిశీలించిన ఎస్పీ

image

నడిగూడెం మండలంలో వరద పరిస్థితులను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. మట్టి రోడ్డులో స్థానికులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆయన ప్రయాణించారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News September 1, 2024

ఈ నంబర్‌లకు ఫోన్ చేయండి: కామారెడ్డి SP

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 100, 87126 86133కు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందవచ్చని కామారెడ్డి జిల్లా SP సింధూ శర్మ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అలాగే వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 1, 2024

సెల్ఫీల కోసం వాగుల వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ ఉదయ్

image

యువకులు సెల్ఫీల కోసం వరద ప్రవాహాల వద్దకు వెళ్లే లాంటి ప్రయోగాలు చేయకూడదని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రహదారుల వంతెనలపై నీరు ప్రవహిస్తుండడంతో అటువైపుగా ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. సమస్యలు ఉంటే వెంటనే 8712657888కి సమాచారం ఇవ్వాలన్నారు.

News September 1, 2024

HYD: భారీ వర్షాల్లో.. పోలీసుల సేవలు భేష్..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీసులు, వికారాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా తీసుకుంటున్న సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

News September 1, 2024

సిద్దిపేట: ‘ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల్లో ఉండాలని పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా చెక్ డ్యామ్ ‌లు, చెరువు‌లు నిండాయా, చెరువు తూంలు దుంకుతున్నాయా అని పార్టీ నేతలతో మాట్లాడి ఆరా తీశారు.

News September 1, 2024

అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: మంత్రి తుమ్మల

image

భారీ వర్షాల వలన ఏర్పడిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అధికారులు అందరూ తమ సెలవలను రద్దు చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పునరావాస చర్యల్లో నిమగ్నం అవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలను వాడుకోవాలని సూచించారు. ప్రజలు హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని అత్యవసర పరిస్థితి ఉంటే తప్పా బయటకు రావద్దని కోరారు.

News September 1, 2024

HYD: భారీ వర్షాల్లో.. పోలీసుల సేవలు భేష్!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ సిటీ పోలీసులు, వికారాబాద్ పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా తీసుకుంటున్న సేవలకు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

News September 1, 2024

భారీ వర్షాల పట్ల మంత్రి కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్

image

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన పునరావాస చర్యలు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.