Telangana

News September 26, 2024

NLG: యువతిపై బావబామ్మర్దుల హత్యాచారం.. కాపలా కాసిన తల్లి

image

దామరచర్ల మండలంలో జరిగిన <<14191461>>హత్యాచార <<>>కేసును పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాల ప్రకారం.. పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, బావ కాంత్రి కుమార్ అదే తండాకి చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, వీరికి వారి తల్లి బుజ్జి సహయపడింది. అక్కడే కాపలాగా ఉండగా, ఇద్దరు కొడుకులు గొంతునొక్కి చంపి చెట్టుకు వేలాడదీశారు. తర్వాత యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.

News September 26, 2024

సిరిసిల్ల: ఆటో డ్రైవర్ మృతి.. చందాలు సేకరించి అంత్యక్రియలు

image

అనారోగ్యంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ఆటో డ్రైవర్ వాసం ప్రసాద్(32) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. పేద కుటుంబం కావడంతో గ్రామస్థులు చందాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News September 26, 2024

కొత్తగూడెం: నేటి నుంచి రెండు రైళ్లు రద్దు

image

భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి నడిచే రెండు రైళ్లli గురువారం నుంచి రద్దు చేస్తున్నట్టు చీఫ్ కమర్షియల్ అధికారి జేమ్స్పల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్లవారుజామున నడిచే సింగరేణి ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 వరకు, కాకతీయ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 7 వరకు రద్దుచేశామని వెల్లడించారు. వరంగల్లో జరుగుతున్న మరమ్మతుల పనుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News September 26, 2024

NZB: జూదం ఆడుతూ పట్టుబడ్డ ఐదుగురు మహిళలు

image

నిజామాబాద్ నగర నడిబొడ్డున సరస్వతినగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జూదం ఆడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం జూదం అడ్డాపై పోలీసులు దాడి చేశారు. అక్కడ జూదం ఆడుతున్న వారిని చూసి ఖంగుతిన్నారు. అనంతరం వారిని అరెస్టు చేశారు.

News September 26, 2024

ప్రపంచ మైనింగ్ ప్రదర్శనలో పాల్గొన్న భట్టి, సింగరేణి C&MD

image

అమెరికా లాస్‌వెగాస్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ ప్రదర్శనను ‘MINExpo’ ను DY CM భట్టి విక్రమార్క, సింగరేణి C&MD బలరాం నాయక్, అధికారుల బృందం పరిశీలించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగే ఈవెంట్‌లో తాజా మైనింగ్ ఆవిష్కరణలు, సాంకేతికత, యంత్రాలను ప్రదర్శించారు. పరిశ్రమల నిపుణులతో నెట్‌వర్క్‌కు అవకాశాలను వివరించారు. ఈవెంట్‌లో 125 దేశాల కంపెనీల నుంచి 44,000 మంది నిపుణులు పాల్గొన్నారు.

News September 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ నేడు అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ అశ్వాపురంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
✓ నేడు సత్తుపల్లి లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
✓ నేడు ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓మధిర పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News September 26, 2024

28న ఉమ్మడి జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ జూనియర్ కాలేజ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ గణపతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెదక్‌లోని ఇందిరాగాంధి స్టేడియంలో అండర్-19 బాలబాలికల విభాగంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు పదోతరగతి మెమో, బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని తెలిపారు.

News September 26, 2024

జూరాలకు 72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో మరింత పెరిగింది. మంగళవారం సాయంత్రానికి 51వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రానికి 72 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఏడు క్రస్టు గేట్లను ఎత్తి 50,232 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 37,715 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

News September 26, 2024

భద్రాద్రి జిల్లాలో నేడు జాబ్ మేళా

image

భద్రాద్రి జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 50 ఖాళీల ఉద్యోగాల భర్తీకి గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. పదో తరగతి చదివి, 18 నుంచి 45 ఏళ్ల వయసు గల వారు అర్హులని చెప్పారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.

News September 26, 2024

పాఠశాలకు వసతులు కల్పించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

image

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ ZPHSలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గత BRS ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, బోధన కల్పించడంలో విఫలమైందన్నారు. వెంటనే జాబితాపూర్ ZHPSకు టాయిలెట్స్, మౌలిక వసతులు కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని లేఖ ద్వారా కలెక్టర్‌ను కోరారు.