Telangana

News September 1, 2024

HYD: పాములు, మొసళ్లు వస్తున్నాయా? సంప్రదించండి!

image

HYD నగరంలో వర్ష బీభత్సానికి పలుచోట్ల పాములు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓల్డ్ సిటీ హసన్ నగర్ ప్రాంతంలో పైతాన్ రాగా.. స్నేక్ క్యాచర్ హకీం షాకిల్ అప్రమత్తమై, పామును పట్టుకున్నారు. పాములు, మొసళ్లు కనిపిస్తే..TFD 18004255364, ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ 8374233366, అనిమల్ వారియర్స్ 9697887888ను సంప్రదించండి.

News September 1, 2024

రామపురంలో సాగర్ ఎడమ కాలువకు గండి

image

నడిగూడెం మండల పరిధిలోని రామచంద్రాపురం 117 కిలోమీటర్ల వద్ద వరదకి సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. పంట పొలాల నుంచి వరద నీరు గ్రామంలోకి చేరుతోంది. గతంలో గండి పడడంతో అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఎన్ఎస్పి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.

News September 1, 2024

దుగ్గొండి: నీటి వరదకు కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం

image

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వరదలో మహిళ మృతదేహం కొట్టుకు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మండల వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. దీంతో మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

News September 1, 2024

మెదక్: బాబోయ్ కుక్కలు.. హడలెత్తిస్తున్నాయి..!

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల నుండి మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు కుక్కలు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలు చాలా గ్రామాల్లో ప్రజలను ప్రమాదాలకు గురి చేస్తున్నా యి. ఈ మధ్యకాలంలోనే దుబ్బాకలో పూరి గుడిసెలో ఉన్న ముసలమ్మపై దాడి చేసిన సంఘటన తెలిసిందే. దాదాపు కుక్కల గుంపులో 50 నుండి 100 వరకు కుక్కలు ఉండి గ్రామాల్లో ఇష్టానుసారంగా సంచరిస్తున్నాయి. వీటిపై దృష్టిపెట్టాలని అంటున్నారు.

News September 1, 2024

BREAKING..ఖమ్మం: వరదలో చిక్కుకున్న 16 మంది

image

ఖమ్మం జిల్లాలో రెండురోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఖమ్మం గ్రామీణ మండలం వాల్యతండాలో చెరువు తెగింది. దీంతో తండాలోని ఓ ఇంట్లో 6 వ్యక్తులు చిక్కుకున్నారు. ఆ కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి మరో నలుగురు అదే వరదలో చిక్కుకున్నారు. అటూ తీర్థాల వద్ద మరో ఆరుగురు చిక్కుకున్నారు. 16 మంది బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

News September 1, 2024

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండండి: మంత్రి కొండా సురేఖ

image

అల్పపీడన ద్రోణితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అన్నారు. విద్యుత్ పోల్సు ముట్టుకోరాదని తెలిపారు. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండవద్దన్నారు. సహాయం కొరకు 040-21111111 మరియు 9000113667 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో మంత్రి సురేఖ పోస్ట్ చేశారు.

News September 1, 2024

పిఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నిక.. హర్షం

image

పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుండు లక్ష్మణ్ ను పిఆర్టియు మెదక్ జిల్లా సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి కృష్ణ, అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు మల్లారెడ్డి, రవి కుమార్, చంద్రశేఖర్, సంతోష్ హర్షం వ్యక్తం చేశారు.

News September 1, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం

image

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సూచించారు.

News September 1, 2024

HYD: దంచి కొట్టిన వర్షం.. RAIN REPORT

image

HYD,RR,MDCL,VKB జిల్లాలలో వర్షం దంచికొట్టింది. 24 గంటల్లో అత్యధికంగా RR జిల్లా కేశంపేటలో 208.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..తలకొండపల్లి-146.5, నందిగామ-137, మేడ్చల్ జిల్లాలో కీసర-105.8, సింగపూర్ టౌన్షిప్-81, HYD జిల్లా యూసఫ్ గూడ-74.8, షేక్ పేట-72.8, VKB జిల్లాలో యలాల్-128.8, కుల్కచర్ల-125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షం దాటికీ లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

News September 1, 2024

MBNR: పొంగిపొర్లుతున్న వాగులు.. రాకపోకలు బంద్

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలకు వెళ్ళటానికి రాకపోకలు బంద్ అయ్యాయి. కాలనీలలో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి చేరుతుంది, చెరువులు కుంటలకు భారీ వర్షం నీరు వచ్చి చేరుతుంది. భారీ వర్షం నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు.