Telangana

News September 1, 2024

NMMS స్కాలర్ షిప్ గడువు పొడగింపు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ఎంపికైన విద్యార్థుల దరఖాస్తుల వివరాల నమోదు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించినట్లు డీఈవో డా.గోవిందరాజులు తెలిపారు. గతేడాది పరీక్షలో అర్హత సాధించి తొమ్మిదో తర గతి చదువుతున్న విద్యార్థుల వివరా లను పోర్టల్లో నమోదు చేయాలని, అక్టోబరు 15 లోగా మొదటి పరిశీలన, 31 వరకు రెండో పరిశీలన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News September 1, 2024

HYD: దంచి కొట్టిన వర్షం.. RAIN REPORT

image

HYD,RR,MDCL,VKB జిల్లాలలో వర్షం దంచికొట్టింది. 24 గంటల్లో అత్యధికంగా RR జిల్లా కేశంపేటలో 208.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..తలకొండపల్లి-146.5, నందిగామ-137, మేడ్చల్ జిల్లాలో కీసర-105.8, సింగపూర్ టౌన్షిప్-81, HYD జిల్లా యూసఫ్ గూడ-74.8, షేక్ పేట-72.8, VKB జిల్లాలో యలాల్-128.8, కుల్కచర్ల-125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వర్షం దాటికీ లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.

News September 1, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిపోలకే పరిమితమైన బస్సులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజుల నుండి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంతెనలు వద్ద వరద ప్రభావం భారీగా ఉండటం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సు సర్వీసుల రద్దు చేయడం వల్ల బస్సుల అన్నీ డిపోలకే పరిమితమైనట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరద ప్రభావం తగ్గిన వెంటనే సర్వీసులను పునరుద్ధరణ చేయనున్నట్లు తెలిపారు.

News September 1, 2024

నిర్మల్: గోదావరి పరివాహక గ్రామాల ప్రజలకు అధికారుల హెచ్చరిక

image

నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా SRSP (శ్రీరాంసాగర్)జలాశయం పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న సందర్భంగా దిగువకు నీటిని వదలనున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వాగులో చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.

News September 1, 2024

వరంగల్: RAIN ఎఫెక్ట్.. రాకపోకలు బంద్

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబాబాద్, ములుగు, తొర్రూరు, ఏటూరునాగారం, బయ్యారం, గార్ల, కొత్తగూడ తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. వాగులు, చెరువుల దగ్గర అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు వద్ద ఇదీ పరిస్థితి..!

image

రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఆదివారం ఉదయం 9 గంటలకు 35,417 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఔట్ ఫ్లో గా 825 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMCలకు గాను, ప్రస్తుతం 62.144 TMCల నీరు చేరినట్లు చెప్పారు.

News September 1, 2024

MBNR: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హెల్ప్ డెస్క్

image

నిర్ణీత సమయంలోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో పాటు పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉండటంతో ఈ ప్రక్రియ పూర్తిచేయడంపై సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నారు.

News September 1, 2024

MNCL: ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

image

HYD జీడిమెట్ల పీఎస్ పరిధి గాజుల రామారంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన దంపతులు వెంకటేశ్(40), వర్షిణి(33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఘటనా స్థలానికి జీడిమెట్ల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 1, 2024

పెద్దపల్లి జిల్లాలో 47,738 కుక్కలు

image

పెద్దపల్లి జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో శునకాల సంతతి నియంత్రించేందుకు పశుసంవర్ధకశాఖ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గ్రామాలు, పట్టణాల్లో జంతు సంతతి నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసి శునకాల గణన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 11,748 పెంపుడు, 35,990 వీధి కుక్కలు కలిపి మొత్తం 47,738 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు.

News September 1, 2024

ధర్మపురి: నేరెళ్ల వాగు ఉధృత ప్రవాహం.. నిలిచిన రాకపోకలు

image

జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతో నేరెళ్ళ గుట్ట వద్ద వంతెనపై భారీగా వరద నీరు పొంగిపొర్లుతోంది. వరద నీటి ప్రవాహం కారణంగా జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య వాహనాల ప్రయాణాలు, రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని స్థానికులు కోరుతున్నారు.