Telangana

News September 1, 2024

సంగారెడ్డి: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుల గడువు పొడిగింపు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్‌కు ఎంపికైన ఫ్రెష్, రెన్యువల్ అభ్యర్థులు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేది వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 15 లోపు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ లో వెరిఫికేషన్ చేయాలన్నారు.

News September 1, 2024

HYD: ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

image

HYD జీడిమెట్ల పీఎస్ పరిధి గాజుల రామారంలో దారుణం జరిగింది. ఓ అపార్ట్మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన దంపతులు వెంకటేశ్(40), వర్షిణి(33), వారి పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు. ఘటనా స్థలానికి జీడిమెట్ల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద

image

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం బ్యారేజీలోకి 1.40 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా అధికారులు 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద 2.60 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 1, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతాలు

image

ఉమ్మడి WGL జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాష్ట్రంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. ఇనుగుర్తిలో 298 మి.మీ వర్షపాతంలో రాష్ట్రం ఎక్కువ రైన్ పాల్ ప్రాంతాల్లో రెండోదిగా ఉంది. దంతాలపల్లిలో 294, మల్యాలలో 294, మరిపెడలో 291, పెద్ద నాగరంలో 288, అయ్యగారి పల్లిలో 286, చిన్న గూడూరులో 285, కల్లెడ(పర్వతగిరి)లో 266, MHBDలో 266, రెడ్లవాడ(నెక్కొండ)లో 259, తాడ్వాయిలో 250, తొర్రూరులో 250మి.మీల కురిసింది.

News September 1, 2024

59 పునరావాస కేంద్రాల ఏర్పాటు: HYD కలెక్టర్

image

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటికే 59 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

MDK: భారీ వర్షాలు.. ‘అప్రమత్తంగా ఉండండి’

image

ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులను మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు అప్రమత్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
✒సంగారెడ్డి- 08455 276155
✒మెదక్- 9391942254
✒సిద్దిపేట- 8457230000, 8712667100

News September 1, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> భద్రాద్రి, ఖమ్మం జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ
> ఖమ్మం మున్సిపాలిటీలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు
> ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
> భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
> జలకళను సంతరించుకుంటున్న చెరువులు

News September 1, 2024

నిజామాబాద్: ముగ్గురు విద్యార్థినులు మృతి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నస్రుల్లాబాద్ మండలంలో విద్యుదాఘాతంతో విద్యార్థిని స్వాతి(18) మృతి చెందింది. కాగా స్వాతి ఇటీవల ఇంటర్ పూర్తి చేసింది. బాన్సువాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అంజలి (12) జ్వరం, వాంతులతో మృతి చెందింది. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని (15) ఉరేసుకుంది.