Telangana

News September 1, 2024

వెంకటాపురం వాగులో ఇద్దరు గల్లంతు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొడుతుంది. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురం వద్ద వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నీలయ్య మృతదేహం లభ్యమైంది. మరొకరైన ఆడెమ్మ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 1, 2024

పాపన్నపేట ఛైర్మన్ పీఠం ఎవరికో..?

image

మెదక్ జిల్లా పాపన్నపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆసక్తికర పోటీ నెలకొంది. తల్లీకొడుకులు, భావబామ్మర్దులు, సీనియర్ నాయకులు పోటీలో ఉన్నట్లు తెలిసింది. ఛైర్మన్ SC రిజర్వు కావడంతో పోటీ పరిమితంగానే ఉన్నా.. MLA, మాజీ MLA మైనపల్లి రోహిత్, హన్మంతరావు మద్దత కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పాపన్నపేట మెదక్ జిల్లాలోనే పెద్ద మండలం. 40 పంచాయతీలు, చుట్టూ మంజీర నది ఉండటంతో వ్యవసాయం పరంగా అభివృద్ధి చెందింది.

News September 1, 2024

MBNR: రెడ్ అలర్ట్.. ‘ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి’

image

భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. బయటికి వెళ్లొద్దన్నారు. అత్యవసరం కోసం ఉమ్మడి జిల్లాలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ✒MBNR-08542-241165✒NGKL-08540-230201✒GDWL-91009 01605✒WNPT-08545-233525, 08545-220351✒NRPT-91542 83914

News September 1, 2024

జగిత్యాల: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ శనివారం కోరారు. రానున్న మూడు రోజులలో అతి భారీ వర్షాలు ఉన్నాయని, వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండలా ఉన్నాయన్నారు. కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటల వద్దకు పిల్లలు, యువత, జాలర్లు సెల్ఫీ కొరకు వెళ్లొద్దని అన్నారు.

News September 1, 2024

NRPT: ‘ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి’

image

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బ్లూ కోర్ట్స్ పోలీసులకు హెల్మెట్లను అందించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి జిల్లా పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం బరువు అనుకోకుండా బాధ్యతగా భావించాలని చెప్పారు.

News September 1, 2024

HYD: మూసి ఆక్రమణలు హైడ్రాకు అప్పగింత

image

మూసివెంట అక్రమ నిర్మాణాల కూల్చివేత అంత ఈజీ కాదని, HMDA, GHMC, రెవెన్యూ అధికారులకు కష్టం అవుతుందని భావిస్తున్న యంత్రాంగం, హైడ్రాకు అప్పగించడంపై సమాలోచన చేస్తుంది. మూసి సర్వేలో 12 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెళ్లడైంది. ఇప్పటికే లంగర్‌హౌస్ నుంచి నాగోల్ వరకు సుమారు 5,501 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. కూల్చివేతలో పునరావాసం కోసం బాధితులకు రూ.2,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

News September 1, 2024

HYD: మూసి ఆక్రమణలు హైడ్రాకు అప్పగింత

image

మూసివెంట అక్రమ నిర్మాణాల కూల్చివేత అంత ఈజీ కాదని, HMDA, GHMC, రెవెన్యూ అధికారులకు కష్టం అవుతుందని భావిస్తున్న యంత్రాంగం, హైడ్రాకు అప్పగించడంపై సమాలోచన చేస్తుంది. మూసి సర్వేలో 12 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెళ్లడైంది. ఇప్పటికే లంగర్‌హౌస్ నుంచి నాగోల్ వరకు సుమారు 5,501 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. కూల్చివేతలో పునరావాసం కోసం బాధితులకు రూ.2,500 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.

News September 1, 2024

మెదక్: BRAOU డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. హుస్సేన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అడ్మిషన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, కళాశాలలోని అభ్యాసక కేంద్ర కో ఆర్డినేటర్ తిరుమల రెడ్డిని సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 1, 2024

బీ అలర్ట్.. అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

image

రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

News September 1, 2024

NZB: ‘సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి’

image

సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.