Telangana

News September 1, 2024

బీ అలర్ట్.. అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

image

రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

News September 1, 2024

NZB: ‘సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి’

image

సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 1, 2024

ఖమ్మం మున్సిపాలిటీలో ఎమర్జెన్సీ హెల్త్ లైన్ ఏర్పాటు: కమిషనర్

image

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఖమ్మం మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ నందు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఏమైనా ఇబ్బంది ఉంటే 7901298265 నెంబర్కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలన్నారు.

News August 31, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> JN: ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ శాఖ డీఈ
> HNK: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం
> MLG: పస్రా-తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై వాగు ప్రవాహం
> MLG: బొగత జలపాతం సందర్శన నిలిపివేత
> JN: వేప చెట్టు కొమ్మ నుంచి నీరు
> WGL: పలు రైళ్ల రద్దు
> MHBD: అంధకారంలో ఏజెన్సీ గ్రామాలు
> BHPL: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
> MLG: ప్రయాణికులను వాగు దాటించిన ఎస్సై

News August 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ గోదావరిఖనిలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బోల్తా పడిన మినీ వ్యాన్.
@ గోదావరిఖనిలో కారును ఢీ కొట్టిన లారీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షం.
@ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.

News August 31, 2024

ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ ప్రవేశాల దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు MVS ఓపెన్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శనివారం తెలిపారు. మరింత సమాచారం కోసం www.braou.ac.in వెబ్సైట్‌ను, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తమ కళాశాలను సంప్రదించగలరని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News August 31, 2024

సంగారెడ్డి: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08455 276155 నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో వర్షాలపై సమీక్ష శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా వర్షాలతో ఇబ్బంది పడితే నేరుగా ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని పేర్కొన్నారు.

News August 31, 2024

కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్ ప్రావీణ్య

image

భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తక్షణ స్పందన నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించి బాధితులు కంట్రోల్ రూమ్‌లోని టోల్ ఫ్రీ నెంబర్ 18004251115ను సంప్రదించవచ్చని తెలిపారు. బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.

News August 31, 2024

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

రాబోయే రెండు మూడు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటల నీటి ప్రవాహం గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నుంచి వరంగల్ రహదారిలో వెళ్లే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

News August 31, 2024

వరంగల్: భారీ వర్షాల ఎఫెక్ట్.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్ కలెక్టర్ ఆదేశాలమేరకు, వరంగల్ MRO కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్టు MRO మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. అదేవిధంగా వరంగల్ మండలంలో ముంపు ప్రాంతాలైన ఏనుమాముల, శ్రీనగర్ బాలాజీ నగర్, చాకలి ఐలమ్మ నగర్, హంటర్ రోడ్ ప్రాంతం, సాయినగర్, NTRనగర్ లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో 18004253424, 701362828, 9948225160 వివరాలు తెలపాలన్నారు.