Telangana

News August 31, 2024

BREAKING.. జనగామ: ఏసీబికి పట్టుబడ్డ విద్యుత్ డీఈ

image

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖ డీఈ ఏసీబీకి చిక్కారు. అధికారుల ప్రకారం.. 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు కుంభం ఎల్లయ్య అనే రైతు వద్ద విద్యుత్ శాఖ డీఈ హుస్సేన్ రూ.20,000 లంచం అడిగాడు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 31, 2024

రేపు ఉమ్మడి KNR జిల్లా సైక్లింగ్ పోటీలు

image

కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా సైక్లింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చైర్మన్ నరేందర్రెడ్డి తెలిపారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో అండర్-14, 16, 18, 23, 23పై సంవత్సరాల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. అందులో ప్రతిభ చూపిన వారిని ప్రాంతీయ స్థాయి ఖేలో ఇండియా, రాష్ట్ర స్థాయి రోడ్డు సైక్లింగ్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

News August 31, 2024

కేసీఆర్‌పై మీరెన్ని మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే: వేముల

image

తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసిఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేసీఆర్ పై మీరెన్ని మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే అన్నారు. కేసీఆర్‌ను డెకాయిట్ అనడం ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

News August 31, 2024

HYD: రెయిన్ అలర్ట్‌.. మేయర్ సమీక్షా సమావేశం

image

రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాల కురిసే అవకాశమున్నందున హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం GHMC కమిషనర్ ఆమ్రపాలి, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల పట్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సేవలకై 040-21111111, 9000113667 నంబర్లలకు‌ సంప్రదించాలన్నారు.

News August 31, 2024

HYD: రెయిన్ అలర్ట్‌.. మేయర్ సమీక్షా సమావేశం

image

రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాల కురిసే అవకాశమున్నందున హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం GHMC కమిషనర్ ఆమ్రపాలి, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల పట్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సేవలకై 040-21111111, 9000113667 నంబర్లలకు‌ సంప్రదించాలన్నారు.

News August 31, 2024

HYD: జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తాం: మంత్రి 

image

తెలంగాణ రాష్ట్ర జాన‌ప‌ద క‌ళాకారుల సంఘం ఆద్వ‌ర్యంలో ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హించిన‌ ప్ర‌పంచ జాన‌ప‌ద దినోత్స‌వ వేడుక‌ల‌కు ముఖ్యఅతిధిగా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హాజ‌రై జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు కథలు, నాటికలు వేసే జాన‌ప‌ద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారన్నారు.

News August 31, 2024

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

image

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితులపై సమీక్షిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 31, 2024

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని అధికారులతో శనివారం అయన టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చెరువులు, కుంటల పైపు పిల్లలు, యువత జాలర్లు వెళ్లకుండా చూడాలన్నారు. వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు నివసించకుండా చూడాలన్నారు. ఎస్పీ, అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

News August 31, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

News August 31, 2024

మెదక్ జిల్లాకు రెడ్ అలెర్ట్, కంట్రోల్ రూం ఏర్పాటు

image

భారీ వర్ష సూచన నేపథ్యంలో మెదక్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 9391942254 అందుబాటులో ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మండల స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు.