Telangana

News August 31, 2024

రామగుండంకు బస్సులు ఇస్తా: మంత్రి పొన్నం

image

రామగుండంను అనేక రకాలుగా అభివృద్ధి చేయాలని స్థానిక MLA మక్కాన్ సింగ్ ఠాగూర్ పనిచేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గోదావరిఖని బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ రామగుండంకు బస్సులు కావాలని అడిగడంతో.. వారి కోరిక మేరకు బస్సులు పంపిస్తానని హామీ ఇచ్చారు.

News August 31, 2024

HYD: చెకోడీలు తింటున్నారా..?

image

మూసీ పరివాహక ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆలు చిప్స్, చెకోడీలు, మురుకులు, మిక్చర్, బెల్లం చెక్కీల తయారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్, అత్తాపూర్, నాగోల్ లాంటి ప్రాంతాల్లో అధికారులు కనీసం తనిఖీలు చేపట్టకపోవడంతో కల్తీ దందా కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని జీహెచ్ఎంసీకి పలువురు ఫిర్యాదు చేశారు.

News August 31, 2024

అత్యవసరం అయితేనే తప్ప ప్రయాణాలు చేయవద్దు: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం: రాబోయే 2,3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

News August 31, 2024

BREAKING: మేడ్చల్ నాదం చెరువు తూము ధ్వంసం చేసిన దుండగులు

image

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని వెంకటాపూర్‌ నాదం చెరువు తూమును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీళ్లు దిగువకు పోటెత్తాయి. నాదం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుపై ఇటీవల పోచారం పీఎస్‌లో కేసు నమోదైంది. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఏఈఈకి ఫిర్యాదు చేశారు.

News August 31, 2024

BREAKING: మేడ్చల్ నాదం చెరువు తూము ధ్వంసం చేసిన దుండగులు

image

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని వెంకటాపూర్‌ నాదం చెరువు తూమును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీళ్లు దిగువకు పోటెత్తాయి. నాదం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుపై ఇటీవల పోచారం పీఎస్‌లో కేసు నమోదైంది. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఏఈఈకి ఫిర్యాదు చేశారు.

News August 31, 2024

BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

image

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. భారీ వర్షానికి ఇంటి వెనుక ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఇంటిపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కాగా ఇంట్లో ఉన్న డిగ్రీ విద్యార్థిని స్వాతి(18) కరెంట్ షాక్‌తో మృతిచెందింది. తీగలు తెగి పడడంతో రేకుల ఇంటికి కరెంట్ పాసైంది. స్వాతి.. ఇంటి తలుపులు ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి చనిపోయింది.

News August 31, 2024

సొంత ఖర్చులతో  బోరు వేయించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సొంత ఖర్చులతో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం బోర్ వేయించారు. ప్రజలు నీటి సమస్యపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి వెంటనే తన సొంత ఖర్చులతో బోరు వేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బోర్ వేయించారు. 

News August 31, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్, నాగర్‌కర్నూల్ జిల్లాకు రెడ్ అలర్డ్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

HYD: GDPలో TOP-3లో మన జిల్లాలే..!

image

తెలంగాణలోని RR, HYD, MDCL జిల్లాలు 2022-23 జీడీపీలో ముందంజలో నిలిచాయి. RR జిల్లా GDP రూ.2,83,419 కోట్లు, HYD- రూ.2,28,623 కోట్లు, మేడ్చల్-రూ.88,867 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో, వికారాబాద్-రూ.19,840 కోట్లతో 21వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే చివరి స్థానంలో ములుగు జిల్లా ఉన్నట్లుగా తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

News August 31, 2024

NZB: భారీ వర్షం.. రోడ్డుపై విరిగి పడిన చెట్టు..

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా అంతటా తడిసి ముద్దైంది. వర్షం ధాటికి కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దేల్‌చెరువు- బాన్సువాడ ప్రధాన రహదారిపై ఓ భారీ వృక్షం విరిగి నేలకొరిగింది. బాన్సువాడ నుంచి పిట్లం, బిచ్కుంద మండలాలకు రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.