Telangana

News September 3, 2025

KNR: టీచర్స్ డే.. ఉత్తమ టీచర్లకు అవార్డులు..!

image

SEPT 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 సెలవు దినం కావడంతో వేడుకలను ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లాస్థాయి పురస్కారాలను అందజేయనున్నారు. 43 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

News September 3, 2025

టేక్మాల్: గణపతి లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

image

టేక్మాల్‌లో గణపతి లడ్డూను ముస్లిం యువకుడు మతీన్ దక్కించుకున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టేక్మాల్‌లోని నాగులమ్మ ఆలయం వద్ద గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూకు నిర్వాహకులు వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో గ్రామానికి చెందిన మతీన్ రూ. 21 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. నిర్వాహకులు అతనికి ఈ ఘటన మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.

News September 3, 2025

మెదక్ జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు

image

తుది ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు.

News September 3, 2025

MDK: అత్తింటి వేధింపులతో నవ వధువు సూసైడ్

image

చిన్నశంకరంపేటకు చెందిన రాధిక(19)కు నెల రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న వానరాసి కుమార్(22)తో పెళ్లి అయింది. కాగా, అత్తింటి వేధింపులు భరించలేక<<17595482>> నవ వధువు రాధిక<<>> ఊరేసుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. అయితే రాధిక తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. తల్లి, అన్న, చెల్లెలు గత ఏడాది చనిపోయారు. ప్రస్తుతం 15 ఏళ్ల తమ్ముడు, ఇద్దరు అక్కలు ఉండగా.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

News September 3, 2025

విద్యార్థులకు క్రీడలు, క్రమశిక్షణ అవసరం: సీఐ రేణుక

image

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు క్రీడలు, క్రమశిక్షణ చాలా అవసరమని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. అల్లాదుర్గ మండలం ముస్లాపూర్ పాఠశాలలో ఎంఈఓ ధనుంజయ అధ్యక్షతన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడ పోటీలు ప్రారంభించారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనన్నారు. మానసిక వికాసం వంటివి విద్యార్థులలో అభివృద్ధి చెందుతాయని స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు ఆడుకోవాలని సూచించారు.

News September 3, 2025

ADB: 3 రోజులు వైన్స్ బంద్

image

ADB అబ్కారీ సర్కిల్ పరిధిలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా 3 రోజులు మద్యం దుకాణాలు బంద్ పాటించాలని ఎక్సైజ్ విజేందర్ పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు తాంసి, భీంపూర్, జైనథ్, మావల, ఆదిలాబాద్, అదేవిధంగా ఈనెల 5వ తేదీ సాయంత్రం 6 నుంచి 7వ తేదీ ఉదయం 10 వరకు బేల, తలమడుగు, జైనథ్, మావల, ఆదిలాబాద్‌లోని వైన్స్, బార్ షాపులు, కల్లు దుకాణాలను మూసి ఉంచాలని సూచించారు.

News September 3, 2025

ఐదు రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు: కలెక్టర్

image

వ్యాధుల నిర్మూలన కోసం ఐదు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్‌వాడీ, పంచాయతీ భవన సముదాయాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. విధులు సరిగా నిర్వర్తించని వారిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 3, 2025

IT కారిడార్‌కు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు: సజ్జనార్

image

నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రయాణికులకు సేవలందించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు నడపనున్నారు. పలు ప్రధాన ప్రాంతాల నుంచి వీటిని హైటెక్ సిటీకి నడిపేలా చర్యల తీసుకుంటున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, హకీంపేట, బోడుప్పల్ నుంచి ఐటీ కారిడార్ (విప్రో, వేవ్ రాక్, కోకాపేట, టీహబ్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ)కు కనెక్టివిటీ పెంచుతామని వివరించారు.

News September 3, 2025

KNR: గిరిజన యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమం

image

కరీంనగర్ జిల్లా గిరిజన యువతీ యువకులకు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని క్యారక్టేరైజేషన్ ప్రాజెక్టులో శిక్షణ కల్పించనున్నారు. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కింద ఈ శిక్షణ జరుగుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. ఇంజినీరింగ్ లేదా ఎంఎస్సీ చేసిన వారు అర్హులు. దరఖాస్తు కోసం https://www.cense.iisc.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News September 3, 2025

ADB: ఈ నెలంతా 30 పోలీస్ యాక్ట్ అమలు

image

జిల్లాలో సెప్టెంబర్ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ముందస్తుగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు.