Telangana

News August 31, 2024

రంగు మారుతున్న వేములవాడ ధర్మగుండం నీరు!

image

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీరు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీరు తొలగించాలని కోరుతున్నారు.

News August 31, 2024

HYD: GDPలో TOP-3లో మన జిల్లాలే..!

image

తెలంగాణలోని RR, HYD, MDCL జిల్లాలు 2022-23 జీడీపీలో ముందంజలో నిలిచాయి. RR జిల్లా GDP రూ.2,83,419 కోట్లు, HYD- రూ.2,28,623 కోట్లు, మేడ్చల్-రూ.88,867 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో, వికారాబాద్-రూ.19,840 కోట్లతో 21వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే చివరి స్థానంలో ములుగు జిల్లా ఉన్నట్లుగా తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

News August 31, 2024

ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: RMKMM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని TGSRTC రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. వాగులు, వంతెనలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు.

News August 31, 2024

రంగు మారుతున్న వేములవాడ ధర్మగుండం నీరు!

image

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీరు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీరు తొలగించాలని కోరుతున్నారు.

News August 31, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్, నాగర్‌కర్నూల్ జిల్లాకు రెడ్ అలర్డ్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

సమస్యలపై ఎంపీని కలిసిన ఆత్మ కమిటీ చైర్మన్

image

వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు శనివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఆత్మ కమిటీ చైర్మన్ ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

News August 31, 2024

పాలిటెక్నిక్ కళాశాల అప్ గ్రేడ్ లేనట్టేనా !

image

జహీరాబాద్ రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అప్ గ్రేడ్ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. ఇంజినీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రంలోని 11 పాలిటెక్ని‌లను పరిశీలన చేసి ఎన్బీఏ చేసిన జాబితాలో రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలకు చోటు దక్కలేదు. 

News August 31, 2024

వేములవాడ: రంగు మారుతున్న ధర్మగుండం నీళ్లు!

image

శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీళ్లు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీళ్లు తొలగించాలని కోరుతున్నారు.

News August 31, 2024

FLASH: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు RED ALERT⚠️

image

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

News August 31, 2024

FLASH: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు PINK ALERT⚠️

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT