Telangana

News August 31, 2024

HYD: సహజ వనరుల రక్షణ కోసమే హైడ్రా: మంత్రి 

image

చెరువులను కాపాడేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘గృహ’ అనే పర్యావరణ సంస్థ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. నదులు, చెరువులు, వాగులు, అడవులు ప్రతీది మానవాళి మనుగడుకు అవసరమేనని పేర్కొన్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను రక్షించుకోలేక పోతే అది పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తుందని అన్నారు.

News August 31, 2024

MBNR: పరిష్కారానికి నోచుకోని సరిహద్దు సమస్య..!

image

జిల్లాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖల భూ రికార్డుల పరంగా స్పష్టత లోపించడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. MBNR, WNP జిల్లాలలో అటవీ, రెవెన్యూ యూ భూములకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల మంత్రివర్గ ఉప సంఘానికి రైతులు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరించాలని మంత్రులు ఆదేశించారు.

News August 31, 2024

‘హైడ్రా OK.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చొద్దు’

image

పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News August 31, 2024

‘హైడ్రా OK.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు కూల్చొద్దు’

image

పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చొద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జలవనరుల సంరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ ఆహ్వానించదగినదే అయినా ఏళ్ల తరబడి నాలాలు, చెరువుల పక్కన ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వాటిని కూల్చివేయడం తగదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News August 31, 2024

గోదావరిఖనిలో కారును ఢీకొన్న లారీ

image

గోదావరిఖని గంగానగర్ పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్తున్న లారీ రాజీవ్ రహదారిపై వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఓ బ్యాంకు మేనేజర్‌కు చెందిన కారుగా గుర్తించారు.

News August 31, 2024

NGKL: కుంటలు, నాళాలు కబ్జా.. రోడ్లపైనే వర్షపు నీరు

image

జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని కొన్ని కుంటలు కబ్జాకు గురి కావడంతో నీరంతా సామాన్యుల ఇళ్లల్లోకి, రోడ్లపైనే పారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలన్నీ కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్లు ప్రధాన రోడ్లపైకి వస్తున్నాయి. హైడ్రా మాదిరిగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News August 31, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

రుద్రూర్: బాత్రూంలో పాలిటెక్నిక్ విద్యార్థిని సూసైడ్

image

రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని హాస్టల్‌లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం బాత్రూంలోకి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అనుమానంతో డోర్ పగలగొట్టగా ఉరివేసుకొని కనిపించింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సైలు సాయన్న, కృష్ణకుమార్ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

News August 31, 2024

నిరుపయోగంగా మారిన సేంద్రియ ఎరువు తయారీ షెడ్లు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సేంద్రియ ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. ఒక్కొక్క షెడ్డుకు రూ.12 లక్షలు వెచ్చించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు పద్ధతుల్లో ఎరువు తయారికి అనుగుణంగా వీటిని నిర్మించారు. అధికారుల, సిబ్బంది అలసత్వం కారణంగా నేటికీ అవి చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి.

News August 31, 2024

కనుమరుగవుతున్న చెరువులు పేటలో హైడ్రా అమలయ్యేనా?

image

NRPT: భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగుపెట్టిస్తున్న హైడ్రా పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న క్రమంలో నారాయణపేట జిల్లాలో అమలు చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నారు. జిల్లాలో భూఆక్రమణలు మితిమీరిపోయాయి. కొండారెడ్డిపల్లి చెరువు కాలువ ఆక్రమణకు గురికాగా, సుభాశ్ రోడ్ లోని బారం బావికుంటతో పాటు పక్కనే ఉన్న మరో కుంటను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.