Telangana

News August 31, 2024

NGKL: కుంటలు, నాళాలు కబ్జా.. రోడ్లపైనే వర్షపు నీరు

image

జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని కొన్ని కుంటలు కబ్జాకు గురి కావడంతో నీరంతా సామాన్యుల ఇళ్లల్లోకి, రోడ్లపైనే పారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నాలాలన్నీ కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్లు ప్రధాన రోడ్లపైకి వస్తున్నాయి. హైడ్రా మాదిరిగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News August 31, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు PINK ALERT⚠️

image

ఉమ్మడి జిల్లాలోని మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

రుద్రూర్: బాత్రూంలో పాలిటెక్నిక్ విద్యార్థిని సూసైడ్

image

రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని హాస్టల్‌లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శనివారం బాత్రూంలోకి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అనుమానంతో డోర్ పగలగొట్టగా ఉరివేసుకొని కనిపించింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సైలు సాయన్న, కృష్ణకుమార్ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

News August 31, 2024

నిరుపయోగంగా మారిన సేంద్రియ ఎరువు తయారీ షెడ్లు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సేంద్రియ ఎరువు తయారీ ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. ఒక్కొక్క షెడ్డుకు రూ.12 లక్షలు వెచ్చించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు పద్ధతుల్లో ఎరువు తయారికి అనుగుణంగా వీటిని నిర్మించారు. అధికారుల, సిబ్బంది అలసత్వం కారణంగా నేటికీ అవి చాలా ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి.

News August 31, 2024

కనుమరుగవుతున్న చెరువులు పేటలో హైడ్రా అమలయ్యేనా?

image

NRPT: భూకబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగుపెట్టిస్తున్న హైడ్రా పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న క్రమంలో నారాయణపేట జిల్లాలో అమలు చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నారు. జిల్లాలో భూఆక్రమణలు మితిమీరిపోయాయి. కొండారెడ్డిపల్లి చెరువు కాలువ ఆక్రమణకు గురికాగా, సుభాశ్ రోడ్ లోని బారం బావికుంటతో పాటు పక్కనే ఉన్న మరో కుంటను కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

News August 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు RED ALERT⚠️

image

కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 31, 2024

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు PINK ALERT⚠️

image

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News August 31, 2024

దుబ్బాక: పుట్టిన రోజునే.. కొడుకు కళ్లముందే తల్లి ఆత్మహత్య

image

దుబ్బాక మండలం గంభీర్పూర్‌లో రవళి(25) పుట్టిన రోజునే కొడుకు కళ్ళేదుటే ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం భర్త సాగర్ రెడ్డి ఉద్యోగానికి వెళ్లగా, మామ బయటకు వెళ్లాడు. పెద్ద కుమారుడిని అంగన్వాడీ కేంద్రానికి పంపి అనంతరం రెండేళ్ల కుమారుడి ముందు ఉరేసుకుంది. తల్లి చీరను పట్టుకొని బాలుడు ఏడవడంతో స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 31, 2024

మంచిర్యాల: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్‌-సిర్పుర్‌కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పుర్‌టౌన్‌ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సిక్రింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ – సికింద్రాబాద్ SEP 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దు చేశారు.

News August 31, 2024

FLASH: NLG, SRPT, YDD జిల్లాలకు PINK ALERT⚠️

image

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.