Telangana

News August 31, 2024

నిజామాబాద్: గోదావరిలో దూకేందుకు వివాహిత యత్నం

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోంకన్ పల్లికి చెందిన ఓ వివాహిత(27) బాసర గోదావరి నదిలో దూకడానికి యత్నించింది. అక్కడే ఉన్న గంగపుత్రులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్ఐ లక్ష్మణ్, హెడ్ కానిస్టేబుల్ వినాయక్, బ్లూకోట్ సిబ్బంది శ్రీనివాస్ అక్కడికి చేరుకొని ఆమెను ఠాణాకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News August 31, 2024

FLASH: హైదరాబాద్‌, రంగారెడ్డికి PINK ALERT⚠️

image

హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

News August 31, 2024

FLASH: హైదరాబాద్‌, రంగారెడ్డికి PINK ALERT⚠️

image

హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ మూడు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు‌ ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
SHARE IT

News August 31, 2024

పురపాలికలకు రూ.235.83 కోట్ల అమృత్ నిధులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 పురపాలికలకు అమృత్ 2.0 పథకం అమలుకు నిధులు కేటాయించారు. పురపాలికల్లో రక్షిత, సుస్థిర తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రెండేళ్ల కిందటే ప్రతిపాదన కార్యరూపం దాల్చగా, ఎన్నికల కోడ్ కారణంగా పనులు ప్రారంభం కాలేదు. కొత్త సర్కార్ పథకం కార్యాచరణకు ఆమోదం తెలపడంతో అవాంతరాలు తొలగిపోయాయి. టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో ఇక పనులు ప్రారంభం కానున్నాయి.

News August 31, 2024

కష్టపడే వారికి పార్టీలో ఎప్పటికీ గుర్తింపు: సంపత్ కుమార్

image

అలంపూర్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ గతంలో మహారాష్ట్ర రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీలో తప్పక గుర్తు ఉంటుందని దానికి ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన సంపత్ కుమార్.

News August 31, 2024

మెదక్: ఒకే రోజు ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. దుబ్బాకకి చెందిన నవీన్(25) అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరేసుకోగా.. చిన్నచింతకుంటకు చెందిన యువకుడు(17) హస్టల్‌లో ఉండి చదువుకో అని తల్లిదండ్రులు మందలించడంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌కు చెందిన సందీప్(37) మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 15 తండ్రితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు.

News August 31, 2024

GDWL: నేడు తాగునీటి సరఫరా బంద్

image

మిషన్ భగీరథ నుంచి జిల్లా ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటిని శనివారం నిలిపివేయనున్నట్లు డీఈ రవిచంద్ర కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న నీటి శుద్ధి కేంద్రం శుభ్రం చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం యథావిధిగా నీటిని సరఫరా చేస్తామని ఆయన వివరించారు.

News August 31, 2024

నిజామాబాద్ జిల్లాలో FM స్టేషన్లు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.

News August 31, 2024

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు FM స్టేషన్లు

image

ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎఫ్ఎం స్టేషన్లను ప్రవేశ పెట్టేందుక కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉభయ జిల్లాలో ఎఫ్ఎం రేడియో సదుపాయం రానుండటంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఒక్కో స్టేషన్ కు 20 నుంచి 30 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సముదాయాలు, సంఘాలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రజలకు చేరవేయడానికి ఎఫ్ఎం రేడియో ఉపయోగించుకోవచ్చు.

News August 31, 2024

పెద్దపల్లి: పలు రైళ్ల రద్దు

image

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్‌-సిర్పూర్‌కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పూర్‌టౌన్‌ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. భద్రాచలం రోడ్‌-బళ్లార్ష, బళ్లార్ష-కాజీపేట వరకు SEP 29 నుంచి OCT 8 వరకు అంతరాయం కలగనుంది.