Telangana

News August 31, 2024

9న ములుగు జిల్లాకు సీఎం?

image

ములుగు జిల్లాలో సెప్టెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని సమాచారం. అందులో భాగంగా అధికార యంత్రాంగం సీఎం పర్యటనకు సమాయత్తమవుతున్నారు. జిల్లా అభివృద్ధిపై సమీక్ష, సమావేశాలు, పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో సీఎం పాల్గొననున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిసింది.

News August 31, 2024

NZB: రాష్ట్రంలోనే GGHలో అత్యధిక OP నమోదు

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH)లో అత్యధిక OP నమోదయింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ నెల 28న 2,680 మంది రోగులు GGHకి వచ్చారు. హైదరాబాద్ ఉస్మానియాలో 2,566 మంది, గాంధీలో 2,192 మంది, వరంగల్ MGMలో 2,385 మంది OPగా నమోదు చేసుకున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలోనే OP తాకిడి పెరిగినట్లు అధికారుల అంచనా.

News August 31, 2024

నీటిపారుదల సమీక్ష సమావేశంలో మంత్రులు

image

భువనగిరిలో పార్లమెంటు నియోజకవర్గం నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పది సంవత్సరాలుగా బునాదిగాని కాలువ, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువలపై వివక్ష చూపించారని మండిపడ్డారు.

News August 31, 2024

మహిళ శక్తి పథకాన్ని పటిష్టంగా చేపట్టాలి: కలెక్టర్

image

ఇందిర మహిళా శక్తి పథకం క్రింద చేపట్టిన వివిధ యూనిట్లను లబ్దిదారులకు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ఇందిర మహిళా శక్తి యూనిట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ మండల వారిగా మహిళ శక్తి పథకం కార్యచరణ చేపట్టాలన్నారు.

News August 31, 2024

సంగారెడ్డి: ‘షీ టీం యాక్టివ్‌గా పని చేయాలి’

image

జిల్లాలో మహిళా భద్రత కోసం షీ టీం యాక్టివ్‌గా పని చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళల భద్రతపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. షీ టీమ్‌లు డివిజన్ల వారీగా బస్టాండ్, స్కూల్, కళాశాల ప్రాంతాల్లో నిత్యం గస్తీ ఉంచాలని చెప్పారు. సమావేశంలో ఎస్ బీ సీఐ విజయ్ కృష్ణ, నార్కోటిక్ సీఐ రమేష్ పాల్గొన్నారు.

News August 31, 2024

హైదరాబాద్‌లో మిలాద్ ఉత్సవాలు వాయిదా

image

హైదరాబాద్‌లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

News August 31, 2024

హైదరాబాద్‌లో మిలాద్ ఉత్సవాలు వాయిదా

image

హైదరాబాద్‌లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

News August 31, 2024

ఆదిలాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం

image

ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్ లో ఉన్న ఎస్బీఐ వారి ఏటీఎంలో చోరీకి గురువారం రాత్రి యత్నం జరిగింది. వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి స్ధానిక శాంతినగర్‌లోని ఏటీఎం అద్దాలు పగులగొట్టి చోరీ చేయటానికి ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవటంతో వెనుదిరిగాడు. ఈ విషయమై ఎస్బీఐ రీజినల్ బ్యాంక్ ఆఫీసర్ సత్యనారాయణ శుక్రవారం పీఎస్ లో ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

News August 31, 2024

సెప్టెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ ఓపెన్

image

ఖమ్మం జిల్లాలో సెప్టెంబర్ నెలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ ను ఓపెన్ చేసినట్లు జిల్లా అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా దివ్యాంగులు మీసేవ సెంటర్ వద్దకు వెళ్లి సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని దివ్యాంగులు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News August 31, 2024

అవని లేఖరాకు NZB ఎంపీ అభినందనలు

image

పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన భారత స్టార్ పార షూటర్ అవని లేఖరాకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా.. ఆమె బంగారం పతకంతో ఉన్న ఫోటోను జత చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్  పార ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 3 గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు.