Telangana

News August 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ ముస్తాబాద్ మండలంలో కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్. @ కరీంనగర్ లో కార్ల షోరూంలో చోరీ. @ జగిత్యాల జిల్లాలో 211 డెంగీ కేసులు నమోదు. @ కరీంనగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ముగ్గురికి జైలు శిక్ష. @ గంభీరావుపేటలో వడ్డీ వ్యాపారిపై కేసు.

News August 30, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> WGL: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ యువ రైతు మృతి
> MHBD: ఇంట్లో భారీగా నగదు అపహరణ
> BHPL: మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం
> MLG: గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్, కేసు నమోదు
> BHPL: ఇసుక తరలిస్తున్న లారీ, ట్రాక్టర్ పట్టివేత
> HNK: జిల్లా కేంద్రంలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు
> WGL: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> MHBD: బట్టల షాపులో చోరీ

News August 30, 2024

కొడుకు మరణ వార్త విని తల్లి మృతి

image

కొడుకు మరణ వార్త విని ఆ బాధను తట్టుకోలేక తల్లి మరణించిన సంఘటన శుక్రవారం చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీ వెంగళరావు కాలనీలో చోటుచేసుకుంది. గూగుల్ సాగర్ (21) పురుగుల మందు తాగి గురువారం మరణించారు. ఈ వార్త విన్న తల్లి తట్టుకోలేక శుక్రవారం హఠాన్మరణం చెందారు. తల్లి కొడుకుల మృతి పట్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 30, 2024

ప్రజల దృష్టి మళ్లించేందుకే “హైడ్రా”మా: RSP

image

హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చిందని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా వెనుక హైడ్రామా జరుగుతుందన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు, మహబూబ్ నగర్ లో పేద వర్గాలకు చెందిన నివాసాలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చి వేశారని ప్రశ్నించారు.

News August 30, 2024

7 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రకటించిన మంత్రి తుమ్మల

image

7 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను, నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబ్ నగర్, వెలగటూరు, గాంధరి , సదాశివనగర్, ఎల్లారెడ్డి, నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

News August 30, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* బోధన్: లాడ్జిలో యువతితో పట్టుబడ్డ కౌన్సిలర్.. బంధువుల దేహశుద్ధి
* NZB: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
* అంతరాష్ట్ర లెండి ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై దృఢ సంకల్పంతో ఉన్నాం: జుక్కల్ MLA
* బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి బాధ్యతల స్వీకరణ
* నసురుల్లాబాద్: ఆటో, బొలెరో ఢీ.. ఒకరు మృతి
* కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
* బాన్సువాడ: అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి

News August 30, 2024

MDK: మండపాలకు పర్మిషన్.. ఇవి తప్పనిసరి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల మరో కీలక సూచన.
➤ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హార్డ్ కాపీని PSలో సమర్పించాలి
➤రూ.145‌‌తో మీసేవా చలాన్ తీసుకోవాలి (అదనపు ఛార్జీ రూ.100)
➤ఎలక్ట్రిసిటీ DD తప్పనిసరి
➤ఆర్గనైజర్ల ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఐదుగురివి జతచేయాలి
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC తీసుకోండి
వీటన్నింటినీ జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే పోలీస్ అనుమతి పొందవచ్చు.
SHARE IT

News August 30, 2024

మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకం: మంత్రి ఉత్తమ్

image

బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ స్కూల్ నీటిపారుదల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

News August 30, 2024

‘రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలి’

image

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయడంతో పాటు ఏకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, హెల్త్ టూరిజం, జూపార్కు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

News August 30, 2024

KTDM: సింగరేణి కార్మికులకు శుభవార్త

image

సింగరేణి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దాూర్లుగా (శాశ్వత ఉద్యోగులు) క్రమబద్ధీకరిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి వారిని జనరల్ మజూర్లుగా గుర్తించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి.