India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంపీఈడీ పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈనెల 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
గణేష్ నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలను పాటించాలని ఎస్పీ శరత్చంద్ర పవర్ నిర్వాహకులను కోరారు. చిన్నపిల్లలు, మహిళలు వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, గుంపుల వద్ద వాహనాలలో టపాకులు పేల్చవద్దని సూచించారు. నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని, స్వచ్ఛంద సేవకుల విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు. అత్యవసరమైతే 100, 112కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.
వినాయక నిమజ్జనం నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 4వ తేదీ(రేపు) ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి పి.శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం A4 దుకాణాలు, 2B బార్లు, CI క్లబ్స్, కల్లు దుకాణాలు/డిపోలు, మిలిటరీ క్యాంటీన్ & టి.ఎస్.బి.సి.ఎల్ KNR డిపో మూసివేయాలని అదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.
గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నేడు ఉదయం 7 గంటల సమయానికి అత్యధికంగా మహమ్మదాబాద్ మండలంలో 43.5 ఎంఎం వర్షపాతం, గండీడ్ మండలంలో 35.0 ఎంఎం వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా అడ్డాకుల మండలంలో 1.3 ఎంఎం వర్షపాతం నమోదైంది. కౌకుంట్ల మండలంలో మాత్రం ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లావ్యాప్తంగా సగటున 10.9 ఎంఎం వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 8న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 8వ తేదీన నిర్వహించనున్న మేళాకు హాజరుకావాలని సూచించారు.
క్రీడల పట్ల ఆసక్తి ఉన్న మెదక్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు క్రీడా పోటీలకు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్ఓ రాధాకిషన్ తెలిపారు. ఈ నెల 6న దరఖాస్తు చేసుకోవాలని, పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే అర్హులని చెప్పారు. ఉద్యోగులు తమ సర్వీస్ సర్టిఫికేట్, తాజా ఐడీ కార్డుతో తమ పేర్లను జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈనెల 6న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్‌సాగర్, ట్యాంక్ బండ్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు RTC అధికారులు తెలిపారు. మెహదీపట్నం, బర్కత్‌పురా, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్- 1,2 డిపోల నుంచి సర్వీసులు ఉంటాయని తెలిపారు. కాచిగూడ, రాంనగర్ నుంచి ఎల్బీనగర్, కొత్తపేట, ఇందిరాపార్క్, గచ్చిబౌలి, వనస్థలిపురం, రాజేంద్రనగర్- లక్డికాపూల్, పటాన్‌చెరు- లింగంపల్లి రాకపోకలు సాగించొచ్చాన్నారు.
బజార్‌ఘాట్‌లోని బంగారు ముత్యాలమ్మ ఆలయం ముందు ఏర్పాటు చేసిన 18 అడుగుల గణేశుడు తళుక్కున మెరిసిపోతున్నాడు. ఈ లంబోదరుడిని ప్రత్యేకంగా స్టోన్స్(వజ్రాల)తో అలంకరించారు. 50 ఏళ్లుగా ప్రతిష్ఠిస్తున్న ఈ గణనాథుడిని ఈసారి మొయినాబాద్‌లో తయారు చేయించారు. చవితి రోజున ప్రారంభమైన అన్నదానం శనివారం వరకు సాగనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అదేరోజు ఈ గౌరిపుత్రుడిని నిమజ్జనం చేయనున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు.
BRS ముఖ్యనేతలు హరీశ్ రావు, సంతోశ్‌రావులపై కవిత తీవ్ర విమర్శలు చేయడంపై TPCC అధికారిక ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి X వేదికగా స్పందించారు. ‘KCRకు వెన్నుపోటు పొడుస్తుంది.. హరీశ్, సంతోష్ రావులేనని కవిత చెప్పింది. వీరిద్దరు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని భవిష్యత్తులో ఎపిసోడ్‌లుగా కవితక్క బయటపెట్టనున్నారు. ఇకపై కవితక్క పేలుస్తుంది చూడండి లక్ష్మీ బాంబులు. హ్యాపీ దీపావళి పింకీస్’ అని ట్వీట్ చేశారు.
60 రకాల వైద్యపరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చే ATMను ఢిల్లీకి చెందిన క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అంకుర సంస్థ రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టుగా కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ATMలను ఏర్పాటు చేసింది. ఈ ATMలో అనేక రోగ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని, ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోగులకు ATMపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇది సక్సెస్ అయితే మరిన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.