Telangana

News August 30, 2024

HYD: కరెంట్‌ స్తంభాలపై కేబుల్స్ తొలగించాలి

image

విద్యుత్ స్తంభాల నుంచి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను TGSPCDL మేనేజింగ్ డైరెక్టర్ ముష్రఫ్ ఫరూఖీ శుక్రవారం ఆదేశించారు. తొలగించనివారిపై చర్యలు తీసుకుంటామని, ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా కేబుళ్లు తొలగిస్తామని విద్యుత్ శాఖాధిపతి తెలిపారు.

News August 30, 2024

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని వారికి మెమోలు జారీ :కలెక్టర్

image

మున్సిపాలిటీలు, మండలాలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని దేవరకొండ మున్సిపల్ కమిషనర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, టిపిఓ ఇంజనీర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.

News August 30, 2024

బోధన్: లాడ్జీలో యువతితో పట్టుబడ్డ కౌన్సిలర్.. బంధువుల దేహశుద్ధి

image

బోధన్ బస్ స్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఒక యువతితో బీఆర్ఎస్‌కి చెందిన బోధన్ మున్సిపల్ కౌన్సిలర్‌ను శుక్రవారం స్థానికులు పట్టుకున్నారు. దీనితో ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆ కౌన్సిలర్‌కు దేహశుద్ధి చేసి కౌన్సిలర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ నెల 7న బోధన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు మంగల్ పాడ్ వద్ద మైనర్‌తో పట్టుబడగా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News August 30, 2024

రామగుండం: పరిశ్రమలు ఉన్నా ఉద్యోగాలు లేవు.!

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు కరువయ్యాయి. కోల్డ్ బెల్ట్ ఏరియాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఇక్కడ పరిశ్రమలకు ఇతర ప్రాంతాల వారికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. RFCL, సింగరేణి, మెడికల్ కాలేజీ, NTPC, బీ-థర్మల్, కేశోరాం లాంటి పరిశ్రమలు ఉన్నాయి.

News August 30, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనిమిది మంది జడ్జిలకు పదోన్నతి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో సివిల్ జడ్జిలు(సీనియర్ డివిజన్)గా ఎనిమిది మంది పదోన్నతి పొందారు. రిటా లాల్ చంద్(మెదక్), శివ రంజని (సిద్దిపేట), అనూష (జహీరాబాద్), లక్ష్మణ చారి, షాలిని (సంగారెడ్డి), సౌమ్య (గజ్వెల్), చందన (సిద్దిపేట), అనిత(నర్సాపూర్) ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41మంది జడ్జిలు పదోన్నతి పొందారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.

News August 30, 2024

HYD: హైడ్రా పరిధిలోకి ఉస్మాన్, హిమాయత్ సాగర్

image

HYD నగర ప్రజలకు తాగునీరు అందించే గండిపేట ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణ బాధ్యతలను కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు CS శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా పరిధిలో ప్రస్తుతం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వాటిని మరింత పెంచి, బలోపేతం చేస్తామన్నారు. కలెక్టర్లు, సీపీ, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాల గురించి వివరించారు.

News August 30, 2024

శతాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతున్న మెదక్ చర్చి

image

మెదక్ జిల్లాలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద రెండవ దేవాలయంగా పేరొందని సీఎస్ఐ మెదక్ చర్చిలో వచ్చే నెల సెప్టెంబర్లో శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సిద్దమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న స్త్రీల మైత్రి ఉత్సవాలు చర్చి వార్షికోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించేవారు. గత 3 ఏళ్లుగా కరోనా కారణంగా చర్చి ఉత్సవాలు జరుగలేదు. ఈసారి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడానికి చర్చి పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.

News August 30, 2024

NZB: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

image

డిచ్పల్లి మండల కేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మండల కేంద్రంలోని సాయినగర్ లో నివాసం ఉంటున్న CRPF రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ భార్య రాథోడ్ విజయ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 30, 2024

ప్రైవేట్ సెక్యూరిటీ వేతనంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

image

తెలంగాణలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ ఏజెన్సీలో పని చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీలు అనేక మందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని చెప్పారు. ఫిజికల్ సెక్యూరిటీలో పనిచేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కనీస వేతనం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

News August 30, 2024

HYD: హైడ్రా పరిధిలోకి ఉస్మాన్, హిమాయత్ సాగర్

image

HYD నగర ప్రజలకు తాగునీరు అందించే గండిపేట ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణ బాధ్యతలను కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు CS శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా పరిధిలో ప్రస్తుతం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వాటిని మరింత పెంచి, బలోపేతం చేస్తామన్నారు. కలెక్టర్లు, సీపీ, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాల గురించి వివరించారు.