Telangana

News August 30, 2024

HYD: విపత్తుల నియంత్రణపై టోల్ ఫ్రీ నంబర్

image

విపత్తుల నియంత్రణపై పదేళ్లుగా ప్రణాళిక లేకపోవడంపై మంత్రి పొంగులేటి విస్మయం వ్యక్తం చేశారు. గురువారం 9 విభాగాల అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే 2నెలల్లో హైదరాబాద్, గోదావరి పరివాహక జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

News August 30, 2024

HYD: విపత్తుల నియంత్రణపై టోల్ ఫ్రీ నంబర్

image

విపత్తుల నియంత్రణపై పదేళ్లుగా ప్రణాళిక లేకపోవడంపై మంత్రి పొంగులేటి విస్మయం వ్యక్తం చేశారు. గురువారం 9 విభాగాల అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే 2నెలల్లో హైదరాబాద్, గోదావరి పరివాహక జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశం ఉన్నందున జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

News August 30, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31, సెప్టెంబర్ ఒకటి తేదీల్లో వారంతపు సెలవులు కాగా.. సెప్టెంబర్ 2 అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి సెప్టెంబర్ 3 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని పేర్కొన్నారు.

News August 30, 2024

LLM కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని డిమాండ్

image

తెలంగాణలో న్యాయ కోర్సు LLM కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు. రాష్ట్రంలో శుక్రవారంతో LLM కౌన్సెలింగ్ పూర్తి కానుంది. కానీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని LLB విద్యార్థులకు ఇటీవలే ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తి అవ్వగా, ఫలితాలు వెలువడలేదు. దీంతో తామంతా నష్టపోతామని వాపోతున్నారు. కేయూ LLB ఫలితాలు వచ్చిన తర్వాతే LLM సీట్లు కేటాయించాలని అధికారులను కోరుతున్నారు.

News August 30, 2024

కరీంనగర్: గణపతి ప్రతిమలు ‘సిద్ధం’

image

ఉమ్మడి జిల్లాలో గణపతి మండప నిర్మాణాలు జోరందుకున్నాయి. విక్రయ కేంద్రాల్లో ప్రతిమలు సిద్ధంగా ఉన్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలని పలువురు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఏటా 200కు పైగా మట్టి విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి విగ్రహాన్ని రూ.12 లక్షలు వెచ్చించి రూపొందిస్తుండడం విశేషం.

News August 30, 2024

కరీంనగర్: భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు

image

కరీంనగర్ పట్టణ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా ప్రమాదాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య DCMలు, వాటర్ ట్యాంకర్లు, RMCలు, రాకెట్ లారీలు, JCBలు, ఎర్త్ మూవర్‌, ట్రాక్టర్లు, భారీ మోటార్ వాహనాలకు పట్టణంలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.

News August 30, 2024

వరంగల్ మార్కెట్‌కు కొత్త పత్తి రాక

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు కొత్త పత్తి తరలివచ్చింది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి అనంతరం వచ్చే ఈ పత్తి ఈసారి నెల ముందుగానే మార్కెట్‌కు వచ్చింది. అయితే రైతులు ఆశించిన విధంగానే ధర వచ్చింది. ఈ క్రమంలో క్వింటా కొత్త పత్తి ధర రూ.7011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. రేపటి నుంచి మార్కెట్‌కి వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి.

News August 30, 2024

‘ఆరోగ్య మహిళ’ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రతి మహిళ స్థానికంగా ఉన్న ఆరోగ్య మహిళ క్లినిక్‌కి వెళ్లి సుమారు 50 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో శుక్రవారం సభ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహిళా క్లినిక్‌లో రూ. 45 వేల ఖర్చు అయ్యే వైద్య పరీక్షలు, క్యాన్సర్ వ్యాధులను ముందస్తుగా గుర్తిస్తారని తెలిపారు. మహిళలకు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

News August 30, 2024

వరంగల్ మార్కెట్లో రికార్డుల హోరు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. నెల రోజులుగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న ఈరోజు భారీ ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు రికార్డు ధర వచ్చింది. నేడు క్వింటా మక్కలకు రూ.2,960 ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కాగా మంగళవారం రూ.2,885, బుధవారం రూ.2,911, గురువారం రూ. 2936 ధర వచ్చింది.

News August 30, 2024

కరీంనగర్: ఏజెంట్ల మోసాలు.. గల్ఫ్‌లో కష్టాలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కంపెనీ నిబంధనలు పాటించకుండా చాలా మంది చిక్కుల్లో పడుతున్నారు. మరోవైపు నకిలీ ఏజెంట్లతో చాలా మంది మోసపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు నకిలీ ఏజెంట్ల బారిన పడవద్దని, మోసం జరిగితే ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్నారు.