Telangana

News August 30, 2024

వరంగల్ టిమ్స్ ఆస్పత్రి వ్యయం పెంపుపై విచారణకు సీఎం ఆదేశం

image

వరంగల్ టిమ్స్‌ ఆసుపత్రి వ్యయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. గత సర్కారు నిర్మించ తలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యయాలపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ ఆస్పత్రి స్థలం మార్ట్‌గేజ్‌పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అంచనా వ్యయాలను పెంచడానికి గల కారణాలను సీఎం తెలుసుకుంటున్నారు.

News August 30, 2024

అనాథ బాలికను బడిలో చేర్పించిన నిర్మల్ కలెక్టర్

image

ఇటీవల తానూర్ మండలం బెళ్తారోడా గ్రామానికి చెందిన దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం బాలికను నిర్మల్ పట్టణంలోని పాఠశాలలో చేర్పించి, బాలిక చదువుకోవడానికి అవసరమైన వస్తువులను కొనిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని బాలికకు సూచించారు. ఇందులో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

News August 30, 2024

ఉమ్మడి జిల్లాలో 6ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు

image

రాష్ట్రంలో కొత్తగా 30 ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేయుటకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. త్వరలో రాష్ట్రంలోని 10 నగరాల్లో 30 ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండలో-3, సూర్యాపేటలో-3ఎఫ్ఎం స్టేషను ఏర్పాటు చేయనున్నారు. మాతృభాషలో స్థానిక కంటెంట్ ను పెంచడంతో పాటు కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయని అధికారులు తెలిపారు.

News August 30, 2024

TUలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘ప్లేస్‌మెంట్ డ్రైవ్’

image

తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ కంపెనీవారు విభాగాధిపతి డాక్టర్ ఏ నాగరాజు పర్యవేక్షణలో విద్యార్థులకు ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో పలువురు విద్యార్థులు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అధ్యాపక సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎం యాదగిరి ప్రిన్సిపాల్, విభాగపు అధ్యాపకులు పాల్గొన్నారు.

News August 30, 2024

సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించిన రాజన్న ఆలయ అర్చకులు

image

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎంను ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేశ్ శర్మ తదితరులు కలిశారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ ‌లో రూ.50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News August 30, 2024

KNR: క్షేత్ర స్థాయిలో రైతుల వివరాల సేకరణ

image

ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు రుణమాఫీ వివరాలను సేకరిస్తున్నారు. రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. అయితే సాంకేతిక సమస్యలు, బ్యాంకు తప్పిదాలు, ఆధార్, పట్టా పాస్ బుక్ తదితర సమస్యలతో కొందరు అర్హులకు రుణమాఫీ కాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా నోడల్ ఆఫీసర్లు రుణమాఫీ జమకాని రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు.

News August 30, 2024

రైతులకు నిరాశ.. తగ్గిన అన్ని రకాల మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు పడిపోయాయి. గురువారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,000 పలకగా.. నేడు రూ.17,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి నిన్న రూ.14,600 పలకగా నేడు రూ.14,000కి తగ్గింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH)కి నిన్న రూ.15వేల ధర రాగా ఈరోజు రూ.14,500కి చేరింది.

News August 30, 2024

NZB: రాహుల్ గాంధీకి లేఖ పంపిన సోమశేఖర రావు

image

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను రాహుల్ గాంధీతో చర్చించడానికి సీఐ ఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర రావు శుక్రవారం రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ కొరకు లేఖ పంపించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు పదవులపై చర్చిస్తామన్నారు.

News August 30, 2024

అందరికీ ఒకే రూల్.. HYDRA ఆఫీస్ కూల్చేయండి: హరీశ్ రావు

image

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.

News August 30, 2024

అందరికీ ఒకే రూల్.. HYDRA ఆఫీస్ కూల్చేయండి: హరీశ్ రావు

image

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.