Telangana

News August 30, 2024

అందరికీ ఒకే రూల్.. HYDRA ఆఫీస్ కూల్చేయండి: హరీశ్ రావు

image

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.

News August 30, 2024

ప్రతిపక్షంపై కక్షతో అభివృద్ధిని అడ్డుకుంటున్న సర్కార్‌: హరీశ్ రావు

image

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు రూ.10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు.

News August 30, 2024

దేవాదుల ప్రాజెక్టు పనుల పూర్తికి వచ్చే ఏడాది డెడ్‌లైన్!

image

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు నిర్ణయించారు. జలయజ్ఞం కింద 2005లో రూ.6 వేల కోట్లతో ప్రారంభించగా, ఇప్పటికీ రూ.14 వేల కోట్లు వెచ్చించారు. నానాటికీ గడువు, అంచనా వ్యయం పెరుగుతోంది. పూర్తి పనులకు మరో రూ.3 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.

News August 30, 2024

వేములవాడ: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన విక్కుర్తి నవీన్ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి మానేశాడు. కొంతకాలంగా అతడికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనో వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరేసుకున్నాడు. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News August 30, 2024

సంగారెడ్డి: మగ్గం వర్క్ ఉచిత శిక్షణకు ఆహ్వానం

image

సంగారెడ్డి స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం సెప్టెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు శిక్షణ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

News August 30, 2024

ఓపెన్ 10th, ఇంటర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారి కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందే అభ్యర్థులు జిల్లా పరిధి స్టడీ సెంటర్లను సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా కో-ఆర్డినేటర్‌ను ఫోన్ నంబర్ 8008403516లో సంప్రదించాలని కోరారు.

News August 30, 2024

NGKL: శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఆదమరిస్తే.. ప్రమాదమే !

image

శ్రీశైలం- మద్దిమడుగు వైపు వెళ్లి వచ్చే రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మహబూబ్‌నగర్ నుంచి మద్దిమడుగు, శ్రీశైలానికి వెళ్లే దారి పలు చోట్ల కోతకు గురైంది. రోడ్డు సైడుకు గోతులు ఏర్పడి ఎదురెదురుగా వచ్చే వాహనాలు సైడ్ తీసుకునే క్రమంలో ప్రమాదరకరంగా ఉంది. జాతీయ రహదారుల అధికారులు వెంటనే స్పందించి ఘాట్ రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

News August 30, 2024

HYD: చనిపోతూ.. ఐదుగురికి LIFE ఇచ్చాడు!

image

చనిపోతూ ఐదుగురికి LIFE ఇచ్చాడు ఓ యువకుడు. MBNR హన్వాడ వాసి చెన్నయ్య(35) ఈ నెల 26న యాక్సిడెంట్‌లో గాయపడగా HYD ఉస్మానియాలో చేర్చారు. వైద్యం అందించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులను ఒప్పించి అతడి కాలేయం, 2 కిడ్నీలు (జీవన్‌దాన్) సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. దీంతో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టాడని జీవన్‌దాన్ ఇన్‌ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.

News August 30, 2024

60 టీఎంసీలకు చేరిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 60 టీఎంసీలకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 8,503 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కాగా ప్రాజెక్ట్ నుంచి వివిధ కాల్వల ద్వారా 4,425 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1085.10 అడుగుల (60.118 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

News August 30, 2024

HYD: చనిపోతూ.. ఐదుగురికి LIFE ఇచ్చాడు!

image

చనిపోతూ ఐదుగురికి LIFE ఇచ్చాడు ఓ యువకుడు. MBNR హన్వాడ వాసి చెన్నయ్య(35) ఈ నెల 26న యాక్సిడెంట్‌లో గాయపడగా HYD ఉస్మానియాలో చేర్చారు. వైద్యం అందించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులను ఒప్పించి అతడి కాలేయం, 2 కిడ్నీలు (జీవన్‌దాన్) సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. దీంతో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టాడని జీవన్‌దాన్ ఇన్‌ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.