Telangana

News August 30, 2024

HYD: చనిపోతూ.. ఐదుగురికి LIFE ఇచ్చాడు!

image

చనిపోతూ ఐదుగురికి LIFE ఇచ్చాడు ఓ యువకుడు. MBNR హన్వాడ వాసి చెన్నయ్య(35) ఈ నెల 26న యాక్సిడెంట్‌లో గాయపడగా HYD ఉస్మానియాలో చేర్చారు. వైద్యం అందించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులను ఒప్పించి అతడి కాలేయం, 2 కిడ్నీలు (జీవన్‌దాన్) సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. దీంతో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టాడని జీవన్‌దాన్ ఇన్‌ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.

News August 30, 2024

హన్వాడ: GREAT.. ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపాడు

image

హన్వాడ మండలానికి చెందిన గుంత చెన్నయ్య(35) ఈనెల 26న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. అత్యవసర విభాగంలో వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అతడి కాలేయం, 2 కిడ్నీలు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు, 2 కంటి కార్నియాలను చూపు లేని వారి అమర్చినట్లు జీవన్‌దాన్ ఇన్‌ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.

News August 30, 2024

వరంగల్ మార్కెట్‌‌లో తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర మళ్లీ తగ్గింది. ఈరోజు క్వింటా పత్తి రూ.7,500 పలికింది. ఈ వారం మొదటి రోజు (మంగళవారం) పత్తి ధర రూ.7,600 పలకగా, బుధవారం రూ.7,560కి చేరింది. గురువారం మరింత తగ్గి రూ.7,555కి పడిపోయి, నేడు మరింత పతనమైంది. పత్తి ధరలు రోజురోజుకు తగ్గుతుండడంతో రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.

News August 30, 2024

గోదావరిఖని: కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్య

image

రామగుండం కార్పొరేషన్ కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ కుమారుడు పవన్ (25) గోదావరిఖని గంగానగర్‌లోని వారి ఇంట్లో తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2024

మంచిర్యాల: PACS ఉద్యోగి సస్పెండ్

image

మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి పెంట సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. PACSలో రైతులకు తెలియకుండానే వారి పేరిట రుణాలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని, రుణాలు, నిధులు, ఎరువుల విక్రయాల నగదు సొంతానికి వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. అధికారులు కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. దీంతో జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

News August 30, 2024

కామారెడ్డి: తహశీల్దార్ SUSPEND.. UPDATE

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్‌ లక్ష్మణ్ <<13969284>>సస్పెండ్ <<>>అయిన విషయం తెలిసిందే. వివరాలిలా.. తహశీల్దార్ డబ్బులిస్తేనే పనులు చేస్తారని రైతులు ఆరోపణతో అధికారులు విచారణ చేపట్టారు. గత శుక్రవారం ఓ రైతు వారసత్వ భూమి పట్టామార్పిడికి తహశీల్దార్‌ను సంప్రదిస్తే మీ సేవ వ్యక్తి మధ్యవర్తిగా రూ.12 వేలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. దీంతో విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశారు.

News August 30, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాలలో 43.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా గణపూర్లో 40.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా జక్లేర్‌లో 36.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా రాజోలిలో 34.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లెలో 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.

News August 30, 2024

మైగ్రేషన్‌పై వచ్చిన విద్యార్థులను తిరిగి పంపిన నవోదయ

image

నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర నవోదయ విద్యాలయం నుంచి తొమ్మిదో తరగతి చదివేందుకు వచ్చిన మైగ్రేషన్ విద్యార్థులను తిరిగి మధురకు పంపించారు. వాతావరణం భాష సహకరించక పోవడంతో ఏడుగురు బాలికలను, 15 మంది బాలురు లను తిరిగి మధుర నవోదయ విద్యాలయానికి పంపుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. ఇక్కడ విద్యార్థులు అక్కడికి అక్కడ విద్యార్థులు ఎక్కడికి వెళ్లడం సహజమన్నారు.

News August 30, 2024

ఓపెన్ 10th, ఇంటర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారి కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందే అభ్యర్థులు జిల్లా పరిధి స్టడీ సెంటర్లను సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా కో-ఆర్డినేటర్‌ను ఫోన్ నంబర్ 8008403516లో సంప్రదించాలని కోరారు.

News August 30, 2024

నస్రుల్లాబాద్: మద్యం మత్తులో ఒకరిపై దాడి

image

ఇద్దరు వ్యక్తులు కలిసి మద్యం మత్తులో ఒకరిపై దాడి చేసిన ఘటన నస్రుల్లాబాద్, వర్ని మండల సరిహద్దులో గురువారం రాత్రి జరిగింది. బాన్సువాడ మండలం కొల్గూరుకు చెందిన ఆంజనేయులును ప్రవీణ్ పని నిమిత్తం వర్నికి తీసుకెళ్లారు. దారిలో ప్రవీణ్, ఆంజనేయులు, వర్నికి చెందిన మరో వ్యక్తి కలిసి మద్యం తాగారు. అనంతరం వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆంజనేయులుపై కర్ర, బ్లేడ్‌తో ప్రవీణ్ మరో వ్యక్తి కలిసి దాడి చేశారు.