Telangana

News August 30, 2024

సెప్టెంబర్ 1 నుంచి మండల దీక్షాధారణ

image

అలంపూర్ పట్టణంలోని 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ సన్నిధిలో సెప్టెంబరు 1 నుంచి మండల దీక్షాధారణ ప్రారంభం అవుతుందని ఈవో పురేందర్ తెలిపారు. అలాగే అర్ధ మండల దీక్ష సెప్టెంబరు 20వ తేదీ నుంచి, నవరాత్రి దీక్ష అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. అమ్మవారికి ఇరుముడి అక్టోబరు 11వ తేదీన సమర్పించాల్సి ఉంటుందని వారు వెల్లడించారు.

News August 30, 2024

పక్షవాతంతో బాధపడుతూ మహిళ ఆత్మహత్య

image

ఇల్లందు మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన ముక్తి వీరమ్మ(55) ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 30, 2024

కరీంనగర్: ప్రధాన జలాశయాలకు పరిమితంగా వరద నీరు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించే ప్రధాన జలాశయాలకు ఈ వానాకాలంలో పరిమితంగానే వరద నీరు వచ్చి చేరింది. శ్రీరామసాగర్ జలాశయంలోకి 63 టీఎంసీల వరద రాగా ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీ ఎగువన గల 0-146 కి.మీ పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి వస్తున్న వరదను నంది, గాయత్రి పంపుహౌజుల ద్వారా వరదకాలువలోకి ఎత్తిపోసి మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలకు తరలిస్తున్నారు.

News August 30, 2024

మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్

image

సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, మున్సిపల్, పంచాయతీ అధికారులు రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులతో సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యాధికారులు వారి ప్రాంతాలలో అవసరమైతే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలన్నారు.

News August 30, 2024

బాలాపూర్‌ గణేశ్ Aagman-2024

image

హైదరాబాద్ వాసులే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే వినాయకచవితి సమీపిస్తోంది. నవరాత్రులకు మరో వారం రోజులే సమయం ఉండడంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం Aagman-2024‌ను నిర్వహించారు. ధూల్‌పేట నుంచి మధ్యాహ్నం బయల్దేరిన భారీ గణనాథుడు సాయంత్రానికి బాలాపూర్‌‌లోని మండపం‌ వద్దకు చేరుకున్నాడు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

News August 30, 2024

బాలాపూర్‌ గణేశ్ Aagman-2024

image

హైదరాబాద్ వాసులే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసే వినాయకచవితి సమీపిస్తోంది. నవరాత్రులకు మరో వారం రోజులే సమయం ఉండడంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం Aagman-2024‌ను నిర్వహించారు. ధూల్‌పేట నుంచి మధ్యాహ్నం బయల్దేరిన భారీ గణనాథుడు సాయంత్రానికి బాలాపూర్‌‌లోని మండపం‌ వద్దకు చేరుకున్నాడు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు.

News August 30, 2024

ADB: రుణమాఫీ నగదు రైతులకు ఇవ్వండి

image

రుణమాఫీ నగదును అప్పు ఖాతా కింద మినహాయించవద్దని, రైతులకు విధిగా నెలాఖరులోగా చెల్లించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. అధికారులతో రైతు రుణమాఫీ, రుణాల క్రమబద్ధీకరణ, మహిళాశక్తి రుణాల మంజూరు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్ల వారీగా విడుదలైన మొత్తం రైతులకు ఇచ్చిన నగదు వివరాలపై ఆరాతీశారు. ఏకరూప దుస్తుల తయారీని అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాధికారి శ్రీధర్, డీఆర్డీఓ సాయన్న ఉన్నారు.

News August 30, 2024

సంగారెడ్డి: సైబర్ బాధితులకు సత్వర న్యాయానికి బ్యాంకర్ల పాత్ర కీలకం: ఎస్పీ

image

సైబర్ బాధితులకు న్యాయం జరిగేందుకు బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు సమాచారం ఇవ్వవద్దని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసు అధికారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

News August 30, 2024

HYD: గణేశ్ మండపాలకు పర్మిషన్.. ఇవి తప్పనిసరి

image

HYDలోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసులు కీలక సూచన చేశారు.
➤పర్మిషన్ కోసం ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
➤మీ సేవలో చలాన్ కట్టాలి. (రూ. 145+100)
➤ఐదుగురు ఆర్గనైజర్ల ‘ఆధార్’ అవసరం.
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే అనుమతి పొందవచ్చు.
➤పర్మిషన్ తీసుకుంటే కరెంట్ FREE అని CM రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అక్రమంగా కనెక్షన్‌ తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.

SHARE IT

News August 30, 2024

ఖమ్మం జిల్లాలో విజృంభిస్తోన్న డెంగ్యూ

image

ఖమ్మం జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతోంది. దీంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో తిరుమలాయపాలెం 79, ఎంవీపాలెం-51, మంచుకొండ-36, నేలకొండపల్లి-29,ఏన్కూరు-21, పెద్దగోపతి-20, బోనకల్లు-19, వల్లభి-18, కొణిజర్ల-17, చింతకాని-15, వైరా-13, సుబ్లేడు-12, కూసుమంచి-12, బోదులండ-11, కామేపల్లి-9, తల్లాడ-9, ముదిగొండ-5, బనిగండ్లపాడు-5, లంకాసాగర్‌-2, వేంసూరులో2 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.