Telangana

News September 7, 2024

HYD: లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: సీఎండీ

image

విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలో సిబ్బంది, అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040-234548845, 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. SHARE IT

News September 7, 2024

ఎల్లం బజార్లో 40 ఫీట్ల భారీ మట్టి గణపతి

image

వినాయక చవితి వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాలకు గణనాథులను భక్తులు బాజాబజంత్రీలతో తీసుకువచ్చారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ తరహాలో 40 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎల్లంబజార్ గణపతి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

News September 7, 2024

HYD: రెండు దశల్లో కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం

image

భారీ ఆక్రమణలతో కునారిల్లిన రాజధానిలోని నాలా వ్యవస్థను గాడిలో పెట్టాలని కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కార్యాచరణ రూపొందించింది. రెండు దశల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రా శుక్రవారం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వంద మంది అధికారులు, సిబ్బంది పరిశీలన మొదలు పెట్టారు. నాలాలపై వరదకు అడ్డుపడుతున్న భవనాలను గుర్తించనున్నారు. అనంతరం 2 దశల్లో వాటిని కూల్చివేయనున్నారు.

నర్సాపూర్: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.

News September 7, 2024

బిక్కనూర్లో వదినను హత్య చేసిన మరిది.. UPDATE

image

బిక్కనూర్‌లో వదినను మరిది <<14035950>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. భగీరథిపల్లికి చెందిన పోచయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు రాములు, రెండో భార్యకు మల్లేశం, సురేశ్ ముగ్గురు కుమారులు ఉన్నారు. భూమి విషయంలో సురేశ్‌కు రాములు భార్య లావణ్యతో తరచూ గొడవ జరుగుతుండేది. ఈక్రమంలో శుక్రవారం మళ్లీ గొడవ జరగడంతో సురేశ్ ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI సాయికుమార్ వెల్లడించారు.

News September 7, 2024

కరీంనగర్: ప్రేమ పెళ్లి పేరుతో మోసం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని రెండుసార్లు అబార్షన్ చేయించి తనను మోసం చేశాడని కరీంనగర్ మండలానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండలానికి చెందిన ఓ యువకుడు.. తనకు రెండుసార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 7, 2024

ప్రజలకు హైదరాబాద్ మేయర్ శుభాకాంక్షలు

image

వినాయక చవితి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కమిషనర్ ఆమ్రపాలి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల విజ్ఞానలు తొలగించే వినాయకుడి అనుగ్రహం నగర ప్రజలందరికీ కలగాలని, అందరి ఇంట సుఖశాంతులు వెళ్లివిరియాలని ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా నగరం మరింత అభివృద్ధి చెందాలని వారు అభిలాషించారు.

HYD: ప్రజల ఫిర్యాదులపై అలసత్వం వద్దు: ఎండీ

image

గ్రేటర్ HYDలోని పలు ప్రాంతాల్లో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మంచి నీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపై అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎండీ అసహనం వ్యక్తం చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి సేవలపై ఆరా తీశారు.