Telangana

News September 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} వరద ప్రభావిత ప్రాంతాల కొనసాగుతున్న సర్వే
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

News September 5, 2024

మెదక్: ఇల్లు కూలి నిరాశ్రయులైన తల్లీకూతురు

image

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో నిరుపేద కుటుంబం నిరాశ్రయులుగా మారారు. గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ భర్త చనిపోగా ఒక కూతురుతో ఇంట్లో నివాసం ఉంటుంది. భారీ వర్షాలకు ఇల్లు కుప్పకూలడంతో ఇద్దరు నిరాశ్రయులయ్యారు. దాతలు ఎవరైనా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News September 5, 2024

HYD: AI, సైబర్ సెక్యూరిటీపై సబ్ సమ్మిట్

image

గచ్చిబౌలి పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల సమక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై గ్లోబల్ సబ్ సమ్మిట్ జరిగింది. AI సిస్టమ్స్ ప్రాముఖ్యతపై నిపుణుల బృందం విస్తృతంగా చర్చించినట్లు తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.

News September 5, 2024

మెదక్ 53, సంగారెడ్డి 121, సిద్దిపేట 48 మంది ఉత్తమ టీచర్లు

image

ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక చేశారు. వీరికి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జిల్లా కలెక్టరేట్లలో వారికి అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేయనున్నారు. వివిధ క్యాటగిరిల్లో కలిపి మెదక్ జిల్లాలో మొత్తం 53 మంది, సంగారెడ్డి జిల్లాలో 121, సిద్దిపేట జిల్లాలో 48 మందిని ఉత్తమ టీచర్లుగా ఎంపిక చేసినట్లు ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు.

News September 5, 2024

HYD: AI, సైబర్ సెక్యూరిటీపై సబ్ సమ్మిట్

image

గచ్చిబౌలి పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణుల సమక్షంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాలపై గ్లోబల్ సబ్ సమ్మిట్ జరిగింది. AI సిస్టమ్స్ ప్రాముఖ్యతపై నిపుణుల బృందం విస్తృతంగా చర్చించినట్లు తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు.

News September 5, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 586.70 అడుగులు (303.9495 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి 1,83,563 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా విద్యుదుత్పత్తికి 29,557 క్యూసెక్కులు, కుడికాల్వకు 7,578 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News September 5, 2024

ఖమ్మం‌లో నేడు పలు రైళ్లు రద్దు

image

ఖమ్మం జిల్లాలో నేడు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలకు మహబూబాబాద్ జిల్లా
కేసముద్రం తాళ్లపూసపల్లి, రాయనపాడు వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో నేడు పలు రైళ్లను ద.మ. రైల్వే రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పె క్టర్ జాఫర్ వెల్లడించారు. పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించనున్నారు. 

News September 5, 2024

బ్రిక్స్ సమావేశాల్లో నారాయణపేట న్యాయవాది

image

మరికల్‌కు చెందిన యువ న్యాయవాది అయ్యప్ప రష్యాలో జరుతున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. బ్రిక్స్ సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొన్న మొదటి వ్యక్తిగా అయ్యప్ప. ఈ సందర్భంగా అయ్యప్ప పలు దేశాల మంత్రులు, ప్రతినిధులను కలిశారు. భవిష్యత్తులో బ్రిక్స్ దేశాలు డాలర్‌పై ఆధారపడకుండా కామన్ కరెన్సీ విధానం తీసుకురావడం కోసం సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు.

News September 5, 2024

విద్యా వైద్యం పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్: మంత్రి రాజనర్సింహ

image

పేదవాడికి ప్రాథమిక హక్కుగా అందాల్సిన విద్యా, వైద్యంపై జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నారు. అ భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ట్రామ, డయాలసిస్ కేంద్రాలు, నూతన మండలాల్లో PHCలు ఏర్పాటు చేయాలన్నారు.

News September 5, 2024

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 130 మంది ఎంపిక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 130 మంది ఉపాధ్యాయులను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. నల్లగొండ జిల్లాలోని వివిధ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోగా మండల కమిటీ పలు ఉపాధ్యాయుల పేర్లను సూచిస్తూ జిల్లా అధికారులకు నివేదిక పంపించింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకోనున్నారు.