India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరదల వల్ల ఏపీలో జరిగిన నష్టానికి కేంద్రం ఎలా సాయం చేయాలనుకుంటుందో తెలంగాణకు కూడా అలానే సహాయం అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, వాటిని చూసేందుకు ప్రజలేవరు రావద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణాలతో పాటు గ్రామ పంచాయతీల పరిధిలో చిన్న, పెద్ద చెరువులు, వాగులు ప్రమాదకర స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయని చెరువులు, వాగులు, వంకలు చూసేందుకు వెళ్లవద్దన్నారు.

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును బుధవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించొద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రభాకర్ చారి, ఇరిగేషన్ ఏఈ ఉన్నారు.

కుమ్మెర సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్‌లోకి వరద నీరు చేరడంపై అధికారులు నివేదికను సమర్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి కుమ్మెర పంప్ హౌస్‌ను పరిశీలించారు. పంప్ హౌస్ ఏర్పాటుపై రూపొందించిన చిత్రాలతో అంచనాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.

గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.

ఏండ్ల తరబడి కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్లు మున్నేరు పాలు అయ్యాయని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 మంది విద్యార్థుల భవిష్యత్తు మున్నేరు వరద ప్రశ్నార్థకంగా చేసిందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి సర్టిఫికెట్లు పునర్ జారీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే

@ సిరిసిల్ల కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం. @ మల్యాల మండలంలో నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్య. @ పెద్దపల్లి జిల్లాలో 67 డెంగ్యూ కేసులు నమోదు. @ మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్యకు గురుబ్రహ్మ అవార్డు. @ మట్టి గణపతులను ఏర్పాటు చేయాలన్న జగిత్యాల, కరీంనగర్ కలెక్టర్లు. @ అంగన్వాడి కేంద్రాలలో పిల్లల ఎత్తు, బరువు తప్పకుండా చూడాలన్న సిరిసిల్ల కలెక్టర్.

ఖమ్మం మున్నేరుకు వరద మళ్లీ పెరుగుతోంది. కాల్వఒడ్డు వద్ద ఉన్న మున్నేరు వాగు నీటిమట్టం ఉదయానికి 10 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 13 అడుగులకు చేరింది. క్రమంగా 3 అడుగుల మేర పెరిగింది. వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ఉధృతికి సర్వం కోల్పోయామని, మళ్ళీ ముంపు ప్రాంతాలకు వరద చేరితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోస్గి మండలం బలభద్రాయపల్లిలో నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచందారు. గ్రామానికి చెందిన నరసింహ, కవిత దంపతుల ఇద్దరు కొడుకులు నిహన్స్(3), భానుమూర్తి(2) బుధవారం ఇంటి పక్కన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో వారు ఊరంతా గాలించారు. చివరకు నీటి గుంతలో వెతకడంతో మృతదేహాలు దొరికాయి. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Sorry, no posts matched your criteria.