Telangana

News September 3, 2024

HYD: ఇకనుంచి గల్లీల్లోనే ఆధార్ సేవలు

image

ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు అబిడ్స్ జీపీవో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వీధుల్లోనే ఆధార్ సేవలు అందించనున్నారు. అబిడ్స్‌లోని జీపీవోకి వచ్చి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా కావాల్సిన తేదీల్లో శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పుటికే ధూల్ పేట, కొండాపూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో సేవలందించామని, ఇందుకు నామమాత్రపు రుసుం చెల్లించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ తెలిపారు.

News September 3, 2024

నవీపేట: ఆరేళ్ల బాలికపై అత్యాచారం

image

ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని నవీపేట‌లో సోమవారం వెలుగుచూసింది. బాలిక(6)పై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News September 3, 2024

శ్రీశైలం UPDATE

image

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 4,71,730 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల 67,785 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగరుకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 884.10 అడుగుల (210.5133 TMCలు)గా ఉంది. జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 4,479 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతుందని అధికారులు తెలిపారు.

News September 3, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,789 ఆత్మహత్యలు

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న విషయాలకు సైతం మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో 1,789 మంది ఆత్మహ్యత చేసుకున్నారు. ఆదిలాబాద్-453, నిర్మల్-452, మంచిర్యాల-611, కొమురం భీం-273 మంది సూసైడ్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

News September 3, 2024

కాజీపేట: రైళ్ల రద్దు కొనసాగింపు

image

మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె-కేసముద్రం సెక్షన్ ట్రాక్ ఘటనతో సోమవారం రెండో రోజు కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్ల వివరాలు.. 5న డోర్నకల్-విజయవాడ(07755), ప్యాసింజర్, డోర్నకల్- కాజీపేట(07754) ప్యాసింజర్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్, నాగపూర్, నడికుడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు.

News September 3, 2024

WGL: ‘ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానం’

image

2024-25 ఏడాదికి వరంగల్ జిల్లాలోని షెడ్యూల్డు కులాలు, తెగలు, వెనుకబడిన, అల్ప సంఖ్యాక, దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31 లోగా ‘ఈపాస్ వెబ్ సైట్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 3, 2024

పెద్దపల్లి జిల్లాలో 8918కి పైగా జ్వర బాధితులు

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా జ్వర బాధితులు పెరుగుతున్నారు. PDPL జిల్లాలో ఆస్టులో 8918కి మందికి పైగా జ్వరాల బారిన పడ్దారు. ఇప్పటివరకు 67 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రధాన ఆస్పత్రితో పాటు ఓ జనరల్ ఆస్పత్రి, 7పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నామని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News September 3, 2024

వరంగల్ నగరం.. ‘భద్రకాళి చెరువు’తో భయం భయం?

image

వరదలొస్తేనే కాని అధికారులకు చెరువులు, నాలాలు గుర్తుకురావని WGL నగర ప్రజలు మండిపడుతున్నారు. ఏడాది నుంచి భద్రకాళి చెరువు కట్టను ఎవరూ పట్టించుకోలేదని, ప్రస్తుతం చెరువు నిండుకుండలా మారిందన్నారు. పోతననగర్ వైపు చెరువు కట్ట బలహీనంగా మారడంతో దిగువన ఉన్న కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం కలెక్టర్ ప్రావీణ్య చెరువు కట్టను పరిశీలించి అధికారులపై మండిపడటంతో ఇసుక బస్తాలను నింపుతున్నట్లు సమాచారం.

News September 3, 2024

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాలపై ఏర్పాటు చేసిన ‘శాంతి కమిటీ’ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వాడేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

News September 3, 2024

MBNR: భారీ వర్షాలు.. ఈ సీజన్లోనే 9 మంది మృతి!

image

ఈ సీజన్లోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు మట్టి మిద్దెలు, గోడలు కూలి మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. NGKL జిల్లాలోనే 6 మృతి చెందారు. WNPT జిల్లాలో ఓ వృద్ధుడు, NRPT జిల్లాలో తల్లీకుమార్తెలు మరణించారు. గత నాలుగేళ్లుగా పాలమూరులో మట్టి మిద్దెలు కూలి మొత్తం 20 మంది మృతి చెందారు. మట్టి మిద్దెలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.