India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారీ వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ఆపద, ఇతర ఇబ్బందులు వస్తే కలెక్టరేట్ కంట్రోల్ రూం నెంబర్ 1800 599 5459కు కాల్ చేయాలన్నారు. 24 గంటల పాటు పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.

వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో కేసముద్రం ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ-వరంగల్ మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేసముద్రం రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది త్వరితగతిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

వరదలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ప్రజల్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నేరు నది పోటెత్తడంతో కనీవినీ ఎరుగని వరదల వల్ల ఐదుగురు మృత్యువాత పడడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖమ్మంలో వందలాది ఇల్లు ముంపునకు గురై ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు.

PUలో 2 ఎకరాల స్థలంలో పరుగు మార్గం (సింథటిక్ ట్రాక్) ఏర్పాటు చేశారు. 800 Mts,100Mts పరుగు పోటీలకు అనుగుణంగా నిర్మించారు. మార్గంలో 8 మంది క్రీడాకారులు సమాంతరంగా పరిగెత్తే వీలుంది. 2023లో కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా పథకం’ కింద పరుగు మార్గం నిర్మాణానికి రూ.9 కోట్లు, రూ.4 కోట్లతో చేపట్టే క్రీడాకారులు దుస్తులు మార్చుకునే 6 గదులు, ప్రేక్షకులు కూర్చునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు.

HYD నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో HYD సెప్టెంబర్ 2వ తేదీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రైవేటు, ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షం విజృంభిస్తున్న వేళ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, వాతావరణం మార్పులపై పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

HYD నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో HYD సెప్టెంబర్ 2వ తేదీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ప్రైవేటు, ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షం విజృంభిస్తున్న వేళ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, వాతావరణం మార్పులపై పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

✓ట్రాఫిక్‌కి అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు పెట్టొద్దు.
✓హారతి, లైటింగ్ ల్యాంప్స్, విద్యుత్ ఉపకరణాల కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.
✓విద్యుత్ ట్రాన్ఫార్మర్ల వద్ద మండపాలు ఏర్పాటు అంత శ్రేయస్కరం కాదు.
✓రాత్రి వేళల్లో మండపాల వద్ద.. పెద్ద శబ్దాలతో మ్యూజిక్, DJలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.
✓పెద్ద మండపాల ఏర్పాటు గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వటం మంచిది.

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి టి.రాధిక సూచించారు. పంటల రక్షణ కోసం యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆమె తెలిపారు. ముందుగా పంట పొలాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు తరలించాలని. అనంతరం యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆమె రైతులకు సూచించారు. వర్షాలు తగ్గిన అనంతరం పంటలకు మందులు పిచికారి చేయాలని సూచించారు.

> MHBD: సలాం పోలీసన్న.. జోలె కట్టి వృద్ధురాలిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు
> WGL: జిల్లా వ్యాప్తంగా వర్షం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు
> MLG: లక్నవరం వేలాడే వంతెన పైకి వరద
> MHBD: భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
> MLG: బొగతా జలపాతం ఉగ్రరూపం
> HNK: విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు: ఎమ్మెల్సీ
> MHBD: రాళ్లవాగులో చిక్కుకున్న డీసీఎం
> JN: వరద ప్రవాహంలో గల్లంతయిన మేకలు

*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన *NZB, KMR ప్రాజెక్టులకు పోటెత్తిన వరద *NZB రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి *KMR డెంగ్యూతో వ్యక్తి మృతి *ACBకి పట్టుబడ్డ ఇన్‌ఛార్జ్ అర్వో నరేందర్ సస్పెండ్ *బిక్కనూర్ వరద నీటిలో చిక్కిన వారిని కాపాడిన పోలీసులు *డిచ్పల్లి: వివాహితది ఆత్మహత్య కాదు.. హత్య *బాన్సువాడ ప్రేయసిన హత్య చేసిన ప్రియుడు.
Sorry, no posts matched your criteria.