India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముందని శుక్రవారం రాత్రి వరద గేట్ల నుంచి దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో
నది పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని డిపోల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ DM కార్యక్రమం రేపు నిర్వహించాల్సిందిగా రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆదేశించారు. రేపు సాయింత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక డిపో మేనేజర్లకు కాల్ చేసి సమస్యలను దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు…
ఖమ్మం: 9959225958
మధిర: 9959225961
సత్తుపల్లి: 9959225962
భద్రాచలం: 9959225960
కొత్తగూడెం: 9959225959
మణుగూరు: 9959225963

విద్యుత్ స్తంభాల నుంచి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను TGSPCDL మేనేజింగ్ డైరెక్టర్ ముష్రఫ్ ఫరూఖీ శుక్రవారం ఆదేశించారు. తొలగించనివారిపై చర్యలు తీసుకుంటామని, ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా కేబుళ్లు తొలగిస్తామని విద్యుత్ శాఖాధిపతి తెలిపారు.

చింతూరు మండలం లక్కవరం అటవీ ప్రాంతం నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 378 తాబేళ్లను అటవీ అధికారులు పట్టుకొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున పెట్రోలింగ్ చేస్తుండగా పట్టుకున్నట్లు సుకుమామిడి రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణరావు తెలిపారు. అనంతరం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

విద్యుత్ స్తంభాల నుంచి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను TGSPCDL మేనేజింగ్ డైరెక్టర్ ముష్రఫ్ ఫరూఖీ శుక్రవారం ఆదేశించారు. తొలగించనివారిపై చర్యలు తీసుకుంటామని, ఆదేశాలు పాటించకుంటే తామే స్వయంగా కేబుళ్లు తొలగిస్తామని విద్యుత్ శాఖాధిపతి తెలిపారు.

మున్సిపాలిటీలు, మండలాలలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వివిధ అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని దేవరకొండ మున్సిపల్ కమిషనర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, టిపిఓ ఇంజనీర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.

బోధన్ బస్ స్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఒక యువతితో బీఆర్ఎస్‌కి చెందిన బోధన్ మున్సిపల్ కౌన్సిలర్‌ను శుక్రవారం స్థానికులు పట్టుకున్నారు. దీనితో ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆ కౌన్సిలర్‌కు దేహశుద్ధి చేసి కౌన్సిలర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ నెల 7న బోధన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు మంగల్ పాడ్ వద్ద మైనర్‌తో పట్టుబడగా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు కరువయ్యాయి. కోల్డ్ బెల్ట్ ఏరియాలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఇక్కడ పరిశ్రమలకు ఇతర ప్రాంతాల వారికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. RFCL, సింగరేణి, మెడికల్ కాలేజీ, NTPC, బీ-థర్మల్, కేశోరాం లాంటి పరిశ్రమలు ఉన్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో సివిల్ జడ్జిలు(సీనియర్ డివిజన్)గా ఎనిమిది మంది పదోన్నతి పొందారు. రిటా లాల్ చంద్(మెదక్), శివ రంజని (సిద్దిపేట), అనూష (జహీరాబాద్), లక్ష్మణ చారి, షాలిని (సంగారెడ్డి), సౌమ్య (గజ్వెల్), చందన (సిద్దిపేట), అనిత(నర్సాపూర్) ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41మంది జడ్జిలు పదోన్నతి పొందారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.

HYD నగర ప్రజలకు తాగునీరు అందించే గండిపేట ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణ బాధ్యతలను కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నట్లు CS శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా పరిధిలో ప్రస్తుతం 72 బృందాలు ఏర్పాటయ్యాయని, వాటిని మరింత పెంచి, బలోపేతం చేస్తామన్నారు. కలెక్టర్లు, సీపీ, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో పలు అంశాల గురించి వివరించారు.
Sorry, no posts matched your criteria.