India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుక్రవారం వేములవాడ ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎంను ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేశ్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేశ్ శర్మ తదితరులు కలిశారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు రుణమాఫీ వివరాలను సేకరిస్తున్నారు. రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. అయితే సాంకేతిక సమస్యలు, బ్యాంకు తప్పిదాలు, ఆధార్, పట్టా పాస్ బుక్ తదితర సమస్యలతో కొందరు అర్హులకు రుణమాఫీ కాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా నోడల్ ఆఫీసర్లు రుణమాఫీ జమకాని రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు పడిపోయాయి. గురువారం క్వింటా తేజ మిర్చి ధర రూ.18,000 పలకగా.. నేడు రూ.17,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి నిన్న రూ.14,600 పలకగా నేడు రూ.14,000కి తగ్గింది. మరోవైపు వండర్ హాట్ మిర్చి(WH)కి నిన్న రూ.15వేల ధర రాగా ఈరోజు రూ.14,500కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను రాహుల్ గాంధీతో చర్చించడానికి సీఐ ఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర రావు శుక్రవారం రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ కొరకు లేఖ పంపించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు పదవులపై చర్చిస్తామన్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అందరికీ ఒకే రూల్ ఉండాలని MLA హరీశ్ రావు అన్నారు. HYDలోని HYDRA ఆఫీస్ బుద్ధ భవన్ నాలా కింద ఉందని,కమిషనర్ రంగనాథ్ ముందు దానిని కూలగొట్టాలని అన్నారు.నెక్లెస్ రోడ్డులోని ప్రైవేట్, కమర్షియల్ షాపులు, తదితర వాణిజ్య భవనాలు హుస్సేన్ సాగర్ FTLపరిధిలో ఉన్నాయని వాటిని కూలగొడతారా అని ప్రశ్నించారు. కొందరివి డైరెక్ట్‌గా కూలగొట్టి, మరికొందరికి నోటీసులిచ్చి టైం ఇస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అభివృద్ది కాంక్షను పక్కనబెట్టి, రాజకీయ కక్షతో ముందుకు వెళ్లడం గర్హనీయమని విమర్శించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF) కింద 33 జిల్లాల్లో మంజూరైన సుమారు రూ.10 వేల కోట్ల విలువ చేసే 34,511 పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమన్నారు.

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు నిర్ణయించారు. జలయజ్ఞం కింద 2005లో రూ.6 వేల కోట్లతో ప్రారంభించగా, ఇప్పటికీ రూ.14 వేల కోట్లు వెచ్చించారు. నానాటికీ గడువు, అంచనా వ్యయం పెరుగుతోంది. పూర్తి పనులకు మరో రూ.3 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు.

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన విక్కుర్తి నవీన్ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి మానేశాడు. కొంతకాలంగా అతడికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనో వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరేసుకున్నాడు. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.