Telangana

News September 26, 2024

పాఠశాలకు వసతులు కల్పించాలని కలెక్టర్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

image

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ ZPHSలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గత BRS ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, బోధన కల్పించడంలో విఫలమైందన్నారు. వెంటనే జాబితాపూర్ ZHPSకు టాయిలెట్స్, మౌలిక వసతులు కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని లేఖ ద్వారా కలెక్టర్‌ను కోరారు.

News September 26, 2024

నిజాంసాగర్‌లో చిరుత సంచారం

image

నిజాంసాగర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నర్సింగ్ రావ్ పల్లి చౌరస్తా – నిజాంసాగర్ రహదారిపై గల సైలాని బాబా దర్గాకు సమీపంలో చిరుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినట్లు వాహనదారులు తెలిపారు. అచ్చంపేట్ మోడల్ స్కూల్, మాగి ఫ్యాక్టరీ ప్రాంతాల్లో గతంలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే.

News September 26, 2024

NLG: 11 మంది ఎస్ఐలకు స్థానచలనం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 11 మంది ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్వర్‌ను NLG DSB నుంచి SRPTకి, వెంకటేశ్వర్లును NLG VR నుంచి SRPTకి, కృష్ణయ్యను MLG టూ టౌన్ నుంచి మాడుగులపల్లికి, శోభన్ బాబును మాడుగులపల్లి నుంచి NLG VRకు, విజయ్ కుమార్‌ను వేములపల్లి నుంచి నల్గొండకు, సందీప్ రెడ్డిని NLG 1-టౌన్ నుంచి MLG రూరల్‌కు బదిలీ చేశారు.

News September 26, 2024

9వ స్థానంలో నిలిచిన MHBD రూరల్ పోలీస్ స్టేషన్

image

ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ చేతుల మీదుగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ దీపిక అవార్డు అందుకున్నారు. దీపిక మాట్లాడుతూ.. ఈ అవార్డుతో బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. అనంతరం వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

News September 26, 2024

జగిత్యాల: పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ విభాగంలో, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలం విభాగంలో ట్రాకింగ్, ఎక్స్క్లూజివ్ విభాగాల్లో అవగాహన కల్పించారు.

News September 26, 2024

NZB: ట్రైనీ SIలను అభినందించిన CP

image

హైదరాబాద్‌లో 1 సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకొని నిజామాబాద్ జిల్లాలో బుధవారం రిపోర్టు చేసిన ట్రైనీ ఎస్సైలు పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సైలు శ్రీనివాస్, రాజేశ్వర్, కిరణ్ పాల్, శైలెందర్, సుస్మిత, రమ, సుహాసిని, కళ్యాణిను ఆయన అభినందించారు. ఆయనతో పాటు అదనపు డీసీపీ కోటేశ్వరావు, తదితరులు ఉన్నారు.

News September 26, 2024

ఆదిలాబాద్: వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

image

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 – OCT 1 వరకు వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సబితా అన్నారు. ఈ నెల 26న వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, 27న వాకతాన్ ర్యాలీ, 28న ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు, 29న తల్లిదండ్రుల పోషణ, 30న గ్రాండ్ పేరెంట్స్ డే, OCT 1న వారోత్సవాలు ముగుస్తాయన్నారు.

News September 26, 2024

ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా బుధవారం జడ్చర్లలో ఉదండాపూర్, కొత్తకోటలో కానాయపల్లి గ్రామ శివారులో గల శంకర్ సముద్రం రిజర్వాయర్ పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పరిశీలించారు. అనంతరం భీమా ఫేస్-2 అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News September 26, 2024

28న ఉమ్మడి మెదక్ జిల్లా అథ్లెటిక్ ఎంపికలు

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఇంటర్మీడియట్) ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఉమ్మడి జిల్లా అథ్లెటిక్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శి గణపతి బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు మాత్రమే ఎంపికలకు అర్హులని చెప్పారు. వీటికి హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మెమో, ఇంటర్ బోనాఫైడ్, బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని పేర్కొన్నారు.

News September 26, 2024

మెదక్: మహిళా సంఘాల సభ్యులు 100% అక్షరాస్యత సాధించాలి: కలెక్టర్

image

మెదక్ పట్టణంలోని తెలంగాణ భవన్లో బుధవారం జిల్లా సమైక్య 7వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు 100% అక్షరాస్యత సాధించాలన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లా సమైక్య ప్రగతి పథంలో ముందుకు పోవడం శుభపరిణామం అన్నారు. ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.