Telangana

News August 30, 2024

తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులను వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, బూత్ లెవెల్ అధికారులుతో మొదట మ్యాపింగ్ చేసుకొని, పంచాయతీలు, వార్డుల వారీగా జాగ్రత్తగా జాబితా సిద్ధం చేయాలన్నారు.

News August 30, 2024

NZB: ‘రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోంది’

image

రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోందని జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావు కితాబు ఇచ్చారు. ఆయన గురువారం ఓ మీడియా ఛానల్‌తో డిబేట్ పాల్గొన్నారు. ‘గత పదేళ్లుగా లంచాలు తీసుకొని BRS నేతలు అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించారని అన్నారు. పదేళ్లలో చెరువులను పరిరక్షించే పనులు BRS ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆక్రమణలు చేసిన నేతలు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ వారిని వదిలి పెట్టదని ఆయన స్పష్టం చేశారు.

News August 30, 2024

ADB: ‘వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించండి’

image

జిల్లాలోని వసతిగృహాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా కు బాలల హక్కుల పరీక్షణ వేదిక సభ్యులు వినతి పత్రం అందించారు. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, బాలికల వసతి గృహాలలో మహిళా సిబ్బందిని నియమించాలని విన్నవించారు. ఈ విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. వేదిక సభ్యులు ఎండి షాహిద్, పెందూర్ మధు, రాథోడ్ రోహిదాస్, సాంబశివరావు ఉన్నారు.

News August 30, 2024

మెదక్: ‘క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం’

image

క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో తోడ్పాటు అందిస్తాయని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మెదక్ స్టేడియంలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు చేపట్టిన వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలో క్రీడలు అభివృద్ధి చేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు
బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

News August 30, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలి: CM

image

మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరుగాంచిన HYD బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని CM రేవంత్ రెడ్డి అన్నారు. వినాయకచవితి వేడుకలపై సెక్రటేరియట్‌లో ఆయన స‌మీక్ష నిర్వహించారు. ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని CM సూచించారు. పోలీస్ పర్మిషన్ తీసుకునేవారు కరెంట్ కనెక్షన్ కోసం ఎటువంటి డీడీ కట్టనవసరం లేదన్నారు.

SHARE IT

News August 30, 2024

ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

image

ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సంబంధిత ఎన్నికలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

News August 30, 2024

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలి: CM

image

మ‌త సామ‌ర‌స్యానికి, ప్ర‌శాంత‌త‌కు పేరుగాంచిన HYD బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత పెంచేలా గ‌ణేశ్ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ ఉండాల‌ని CM రేవంత్ రెడ్డి అన్నారు. వినాయకచవితి వేడుకలపై సెక్రటేరియట్‌లో ఆయన స‌మీక్ష నిర్వహించారు. ఉత్స‌వ క‌మిటీలు, మండప నిర్వాహ‌కులు, ప్ర‌భుత్వ అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌ని CM సూచించారు. పోలీస్ పర్మిషన్ తీసుకునేవారు కరెంట్ కనెక్షన్ కోసం ఎటువంటి డీడీ కట్టనవసరం లేదన్నారు.
SHARE IT

News August 30, 2024

పెసర పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి:తుమ్మల 

image

రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిందిగా మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. పెసర పంటకు మద్దతు ధర లభించే విధంగా రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుత వానాకాలంలో 64,175 ఎకరాలలో పెసర పంట సాగయిందని, 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 12 ప్రాంతాల్లో పంటకోతకు వచ్చిందన్నారు.

News August 29, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> NSPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి అడ్మిషన్
> HNK: శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై సాధించాలి: సీపీ
> JN: జిల్లాలో పర్యటించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
> WGL: మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,555, మక్కల ధర రూ.2,936
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద
> WGL: ఎంజీఎంలో కనీస వసతులు కరవు
> BHPL: ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

News August 29, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్.

image

> MHBD: నీటి సంపులో పడి చిన్నారి మృతి..
> WGL: ఉరి వేసుకుని ఒకరు బలవన్మరణం
> MHBD: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
> TRR: వివాహిత ఆత్మహత్యాయత్నం
> BHPL: పేకాట స్థావరాలపై దాడులు
> MHBD: సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు
> BHPL: కాటారంలో దొంగల భీభత్సం
> HNK: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు