India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఉత్తమ టీచర్లకు ప్రతి ఏటా అవార్డులు అందిస్తోంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నేషనల్ బెస్ట్ టీచర్‌గా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్ ఎంపికయ్యారు. ఆయన దమ్మన్నపేట ZPHS పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. అవార్డులో భాగంగా రూ.50వేల నగదు బహుమతి, ప్రశంస పత్రం సిల్వర్ మెడల్ అందచేస్తారు.

> NSPT: విష జ్వరంతో యువకుడు మృతి
> MLG: గోదావరిలో అక్రమంగా దాచిన కలప స్వాధీనం
> MHBD: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
> MLG: గవర్నర్ పర్యటనలో అపశ్రుతి.. పాము కాటుతో కానిస్టేబుల్ అస్వస్థత
> WGL: ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
> JN: ఆంధ్రప్రదేశ్‌లో జనగామ వాసి అరెస్టు
> MHBD: బైకును ఢీ-కొట్టిన బస్సు
> BHPL: అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

> WGL: WAY2NEWS ఎఫెక్ట్.. ఫ్లెక్సీ మార్పు
> MLG: రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సును సందర్శించిన గవర్నర్
> BHPL: ఈనెల 29న జాబ్ మేళా
> WGL: క్వింటా పత్తి ధర రూ.7,600
> BHPL: మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద
> MLG: వాగు దాటాలంటే.. ట్రాక్టర్ టైరు ఆధారం!
> WGL: అండర్ బ్రిడ్జి వద్ద అగ్ని ప్రమాదం
> HNK: విష జ్వరాల నియంత్రణకు చర్యలు

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,42,100 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.76,350, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ 55,090, అన్నదానం రూ.10,660 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల, ముస్తాబాద్ పర్యటనలు రద్దైనట్లు తన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. బుధవారం హనుమకొండ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హనుమకొండ జిల్లాలో ఉండటంతో గవర్నర్ ప్రోగ్రాంలో పాల్గొంటారని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఎలాంటి సంబంధం లేకున్నా ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమంగా కేసులు బనాయించి 168 రోజులు జైల్లో వేయించడం బాధాకరం అని, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. లిక్కర్ పాలసీతో కవితకు ఎలాంటి సంబంధం లేదని, వారి నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళవారం బెయిల్ మంజూరై విడుదల కావడం పట్ల మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు.

చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో నివాసం ఉండే పెన్నేశ్వరి ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీంతో ఆమె మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేస్ దర్యాప్తు చేయగా ఐదుగురు యువకులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీరిలో అర్బాజ్, షెహబాజ్, సోహెల్, వాజిద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నామన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు (80.5TMC)గాను మంగళవారం రాత్రి 7 గంటలకు 1084.6 అడుగులకు (58.709 TMC) నీటిమట్టం చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా 24,014 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తోందని ఔట్ ఫ్లోగా 4,459 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని చెప్పారు.

MLC కవితకు బెయిల్ అందరూ ఊహించిందే. BJP, BRSలు కుమ్మక్కై కవితకు బెయిల్ తెచ్చుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో BJP, రాష్ట్రంలో BRS అధికారంలో ఉందని వెల్లడించారు. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు జరగకపోయినా.. రాజకీయ ప్రయోజనాల కోసం BJPకి తెలంగాణను తాకట్టు పెట్టిన పార్టీ BRS అని ఫైర్ అయ్యారు. పదేళ్ల మీ స్నేహబంధం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ బోధనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పాఠశాలలో అర గంట క్రీడలకు అన్ని తరగతుల వారికి, అరగంట ఇంగ్లీష్ బోధన ఎంపిక చేసిన తరగతుల వారికి తప్పక ప్రతిరోజు కేటాయించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.