Telangana

News August 27, 2024

మెదక్ జిల్లా డీఐఈఓగా బాధ్యతలు స్వీకరించిన మాధవి

image

మెదక్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్( డీఐఈఓ)గా మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవి మంగళవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ డీఐఈఓగా పనిచేసిన సత్యనారాయణ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. మాధవి మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

News August 27, 2024

మెదక్: ప్రభుత్వ వైద్య కళాశాల పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

మెదక్‌లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. డిపార్ట్మెంటల్ తరగతి గదులు, ల్యాబులు, ప్రయోగశాలలు, వివిధ రకాల వసతి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శివదయాళ్ ఉన్నారు.

News August 27, 2024

నాగర్ కర్నూల్: వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకండి: ఎస్పీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్ మాట్లాడారు. వాట్సప్, ఫేస్‌బుక్, టెలిగ్రాం, మొదలైన సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే ఏ.పి.కె. ఫైల్స్ లింకులను ఓపెన్ చేయవద్దని ప్రజలను కోరారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి లింకులను పంపుతున్నారని, వీటిని ఓపెన్ చేస్తే బ్యాంకు అకౌంట్లలోని డబ్బులు పోయే ప్రమాదం ఉందన్నారు.

News August 27, 2024

వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ పమేలా

image

బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. చొప్పదండి మున్సిపాలిటీలోని బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను పరిశీలించారు.

News August 27, 2024

కొండగట్టులో ఇక పార్కింగ్‌కు రుసుం వసూలు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం పరిధిలో కొండపై వాహన పార్కింగ్‌కు రుసుము వసూలు చేయనున్నారు. దేవస్థానం కార్యాలయం ముందు గల ఖాళీ స్థలంలో ప్రస్తుతం వాహన పార్కింగ్ చేస్తున్నారు. దేవస్థానం అధికారులు పార్కింగ్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా అధికారులు పార్కింగ్‌కు రుసుము వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News August 27, 2024

గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సన్నాహక సమావేశం

image

హైదరాబాద్ MCHRHRDలో గణేష్ ఉత్సవాలు – 2024 ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు నాయకులతో కలిసి మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. హైదారాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, MLA దానం నాగేందర్, డీజీపీ, Spl.CS, హైదరాబాద్ సీపీ, కలెక్టర్, హైద్రాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధిత MLA, MLC ఖైరతాబాద్ గణేశ్ ఇతర గణేష్ ఉత్సవ కమీటీ విశ్వహిందు పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

News August 27, 2024

HYD: తెలుగు వర్సిటీలో ప్రవేశాల గడువు పెంపు

image

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీజీ, యూజీ, డిప్లమా కోర్సులలో ప్రవేశాల గడువు ఈనెల 31వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్టర్ తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన వారందరూ ఈ నెల 31వ తేదీలోగా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News August 27, 2024

ADB: ముగ్గురి మృతదేహాలు వెలికితీత

image

ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన అక్షయ్, ఆకాశ్, విజయ్ తాంసీ మండలంలోని బండల్ నాగపూర్‌లోని తమ బంధువు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. అయితే సరదాగా మంగళవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతు కాగా, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, ముగ్గురు యువకుల మృతదేహాలు వెలికితీశారు.

News August 27, 2024

ధర్మపురి: గోదావరి నదికి పెరిగిన వరద

image

ధర్మపురి వద్ద గోదావరి నదిలోకి వరద పెరిగింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిండిన చెరువులు, కుంటలు, వాగుల ద్వారా ప్రవహిస్తున్న నీరు నదిలో చేరుతోంది. ధర్మపురి వద్ద ఉసిరిక వాగు దాటి నీటి ప్రవాహం కొనసాగుతోంది. వాగు దాటి అటువైపు భక్తులు స్నానాలు చేసేందుకు వెళ్లకుండా వరద ప్రవాహం పెరిగింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

News August 27, 2024

HYD: పోలీసు సిబ్బందికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

image

అవినీతి, అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిని ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమేనని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బోరబండ, మధురానగర్ పీఎస్‌లలో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సీపీ స్పందించారు. పంజాగుట్ట ఠాణా మాదిరిగా వీటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ఫిర్యాదులపై విచారణ కొనసాగించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు జాగ్రత్తగా పని చేయాలన్నారు.