India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాగర్ డ్యాం లీకేజీలు కలవరపెడుతున్నాయి. డ్యాం నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్లో కొన్ని బ్లాకుల నుంచి నీటి ఊట వస్తోంది. ప్రధాన డ్యాంలో 1 నుంచి 23వ బ్లాకు వరకు ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్ ఉండగా 24 నుంచి 50వ బ్లాకు వరకు 26 రేడియల్ క్రస్ట్ గేట్లు అమరి ఉన్న ఓవర్ ఫ్లో సెక్షన్ ఉంది. స్పిల్ వేకు కుడివైపు 51 నుంచి 76 వరకు బ్లాకులు ఉన్నాయి. జలాశయంలో గరిష్ట నీటిమట్టం వచ్చినప్పుడల్లా డ్యాం నుంచి నీరు తీకవుతోంది.

ఉమ్మడి జిల్లాలో పంట రుణమాఫీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. మెదక్ జిల్లాలో మొత్తం 81,801 మంది రైతులకు రూ.599.14 కోట్లు జమ చేసింది. అయితే తమకు మాఫీ కాలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 5657 ఫిర్యాదు రాగా.. అత్యధికంగా కొల్చారం మండలం నుంచి ఉన్నాయి. రుణమాఫీ కానీ రైతులంతా AOలకు ఫిర్యాదు చేయాలని, అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా చూస్తామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తెలిపారు.

కాళేశ్వరం వద్ద మళ్లీ ఉభయ నదుల ప్రవాహం పెరిగింది. ఎగువన మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నదితో కలిసి వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. 7.8 మీటర్ల మేర నీటిమట్టం నమోదైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల నదికి వరద ఉధృతి పెరిగిందని అధికారులు అన్నారు.

సంగారెడ్డి జిల్లా నిజాంపేట వద్ద 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన శ్రీనివాస్(27), సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన సునీల్ (25), ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తూ నాందేడ్ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. అక్కడే ఒకరు మృతి చెందగా, మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సమాచారం చరవాణిలో చూసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. ఇందుకు www.telangana.gov.in వెబ్ సైట్ లో సిటిజన్ లాగిన్‌లో చరవాణి నంబరును నమోదు చేస్తే వచ్చే ఓటీపీని ఫోన్లో నమోదు చేస్తే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు సమాచారం, వివరాలు తెలుసుకోవచ్చు. సిటిజన్ లాగిన్ లో చరవాణి ద్వారా వివిధ దస్త్రాలను జత చేసే అవకాశం కల్పించారు.

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేటకి చెందిన పోలు దాసరి సౌమ్య, ప్రియుడు జక్కుల శివకుమార్ యాదవ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా చేపట్టింది. దీంతో ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి పోలీసులు చేచేరుకొని తగు న్యాయం చేస్తామని బాధితురాలికి నచ్చజెప్పారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

జూరాల జలాశయంలోకి వరద కొనసాగుతోంది. జలాశయంలోకి 31 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. జలవిద్యుదుత్పత్తి ద్వారా 39 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు జూరాల అధికారులు తెలిపారు. గేట్ల ద్వారా నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. జలాశయంలో నీటినిల్వ 8.6 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 28 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా దిగువకు 27 వేలు వదులుతున్నారు.

జిల్లావ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతుల సమస్యల కొరకు ప్రభుత్వం “రైతు భరోసా” పేరిట ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ అమలు గురించి అధికారులకు ఈనెల 27న ఉన్నతాధికారులు అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదంటూ మండల వ్యవసాయ అధికారులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ యాప్ రాకతో రైతుల సమస్యలు తీరనున్నాయని పలువులు అంటున్నారు.

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} కొత్తగూడెంలో ఎమ్మెల్యే సాంబశివరావు పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Sorry, no posts matched your criteria.