India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. వారిరువురి మధ్య రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగినట్లు జూపల్లి మీడియోతో పేర్కొన్నారు.

ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్ షాక్‌తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబ సభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్‌లింగంపల్లిలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్తూపం గురించి వివరించారు.

తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారిలో చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పత్తి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బంధువుల దగ్గరికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని వారు గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న బంగారం, నగదు చోరికి గురైనట్లు పేర్కొన్నారు.

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 27, 28 తేదీల్లో ములుగు జిల్లాలో పర్యటించునున్నారు. అందులో భాగంగా ఆయన లక్నవరం సరస్సు, ఐలాండ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సుందరీకరణ ఏర్పాట్ల పనులను శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు.

ఖమ్మం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం చర్చించారు. అలాగే పలు అంశాలపై కేంద్రమంత్రితో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.

HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్‌షాక్‌తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబసభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్ లింగంపల్లిలో అందజేశారు. కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా మాధవరం గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో ఆ మార్గంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.