Telangana

News August 24, 2024

పాల్వంచ: లారీని ఢీకొన్న కారు.. పలువురికి తీవ్ర గాయాలు

image

పాల్వంచ నవభారత్ మైనింగ్ కళాశాల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముందు వెళ్తున్న ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 24, 2024

MDK: డెంగ్యూతో బాలుడి మృతి

image

చిన్నకోడూరు మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన బాలుడు కామ అయాన్స్ (5) డెంగ్యూతో మృతి చెందాడు. స్థానికుల వివరాలు… బాలుడికి గత 3 రోజుల క్రితం తీవ్ర జ్వరం రాగా తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు శనివారం మృతి చెందాడు. ఈ విషయమై డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. రెండు రకాల డెంగ్యూ వైరస్‌లు అటాచ్ కావడంతో మెదడుపై ఎఫెక్ట్ పడి బాలుడు మృతి చెందాడని వివరించారు.

News August 24, 2024

వేములవాడ: 24 గంటల్లో 17 ఆపరేషన్లు

image

వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 17 వివిధ రకాల ఆపరేషన్లు అయ్యాయి. ఇందులో 6 డెలివరీలు, ఒక గర్భసంచిలో గడ్డ, 3 సాధారణ శస్త్రచికిత్సలు, 2 కంటి ఆపరేషన్లు & 5 ఆర్థో ఆపరేషన్లు ఉన్నాయి. ఇందులో సూపరింటెండెంట్, సీనియర్ సర్జన్ డా. పెంచలయ్య, గైనకాలజిస్ట్ డా.సంధ్య, తదితరులున్నారు. ఇక్కడ అన్ని వైద్య సేవలు అందుతున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.

News August 24, 2024

కొండ్రుగట్ల: ‘అంగన్వాడీ కేంద్రాల్లో దోపిడీ, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం’

image

అంగన్వాడి కేంద్రాల్లో దోపిడీ నిర్లక్ష్యం లాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. శనివారం కొండ్రుగట్లలో అంగన్వాడి కేంద్రాన్ని, పల్లె దవాఖానను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం అందించాలని సూచించారు. అలాగే పల్లె దవాఖానాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వైద్యులను ఆదేశించారు.

News August 24, 2024

KMM: రాష్ట్రంలోనే ఉత్తమ బెస్ట్ డిపోగా సత్తుపల్లి

image

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకి ఉత్తమ మొదటి డిపో అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా రూ.3 లక్షల క్యాష్ అవార్డు‌ను సత్తుపల్లి డిపో మేనేజర్ U.రాజ్యలక్ష్మీ ఈ అవార్డును అందుకున్నారు.

News August 24, 2024

సౌదీ ఎడారిలో కరీంనగర్ జిల్లా వాసి మృతి

image

‌కరీంనగర్‌కు చెందిన షహబాజ్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో ప్రాణాలు కోల్పోయాడు. అల్ హాసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. GPS పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ అల్ ఖలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఆఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండ తీవ్రతతో పూర్తిగా బలహీనపడి ఇద్దరూ ప్రాణాలు విడిచారు.

News August 24, 2024

NLG: హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్‌ను అభినందించిన కలెక్టర్

image

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయాచిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్‌ను నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు శాలువా కప్పి అభినందించారు.

News August 24, 2024

BREAKING: HYD: నవ వధువు ఆత్మహత్య

image

జగద్గిరిగుట్ట PSపరిధి రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యువతి మనీషాను ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్య సమాజ్‌లో యువకుడు శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో శేఖర్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులతో ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

News August 24, 2024

BREAKING: HYD: నవ వధువు ఆత్మహత్య

image

జగద్గిరిగుట్ట PSపరిధి రిక్షా పుల్లర్ కాలనీలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. యువతి మనీషాను ప్రేమించి, పెద్దల అనుమతితో జులై 10న ఆర్య సమాజ్‌లో యువకుడు శేఖర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మరో యువతితో శేఖర్‌కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపులతో ఈనెల 11న మనీషా యాసిడ్ తాగింది. చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. శేఖర్ అల్వాల్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

News August 24, 2024

తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వండి: జూపల్లి  

image

మంత్రి జూపల్లి కృష్ణారావు శ‌నివారం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షకావత్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ‌లో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి వెంట తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ముఖ్య‌కాద‌ర్శి వాణిప్ర‌సాద్, తదితరులు ఉన్నారు.