Telangana

News August 29, 2024

కోస్గి ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

కోస్గిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ మెరుగు శ్రీనివాసులు గురువారం తెలిపారు. CSE, CSE(AIML), CSE( డాటా సైన్స్)ల్లో పరిమిత సీట్లు కలవని ఆసక్తిగల విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. ఎంసెట్ పరీక్ష రాసి సీటు రానివారు, పరీక్ష రాయని వారు సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మెట్పల్లిలో రైతుల మాహా ధర్నా. @ మల్యాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. @ రౌడీషీటర్లకు, హిస్టరీ షీటర్లకు వేములవాడలో కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ అఖిల్ మహాజన్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవం.

News August 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

✓ చర్ల: మావోయిస్టుల డంప్ స్వాధీనం
✓ మధిర: ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
✓ చింతూరు: ఘాట్ రోడ్డులో ఆగిన లారీ.. నిలిచిన రాకపోకలు
✓ కొత్తగూడెం పట్టణంలో చిరుజల్లులు
✓ చండ్రుగొండ : దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
✓ ఇందిరమ్మ ఇల్లు అందరికి అందేలా చూస్తాం: ఎంపీ
✓ పెసర పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి:తుమ్మల
✓KMM: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీపీ

News August 29, 2024

MNCL: ‘గంజాయిని రవాణా చేస్తే పిడి యాక్ట్’

image

నిషేధిత గంజాయిని రవాణా, విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ అమలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు కోల్పోయిన డబ్బు త్వరగా రీఫండ్ అయ్యే విధంగా చూడాలని సూచించారు.

News August 29, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. MBNR, NGKL, వనపర్తి, కొడంగల్, జడ్చర్ల, కోస్గి, కల్వకుర్తి, నారాయణపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మీ మండలంలో వర్షం పడుతుందా..? కామెంట్ చేయండి.

News August 29, 2024

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: జిల్లా ఎస్పీ

image

నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కొండమల్లేపల్లిలో గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ గిరిబాబు, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News August 29, 2024

KMR: సహాయం మంజూరు కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

భారత ప్రభుత్వం ఆధీనంలోని దీనదయాళ్ వికలాంగ పునరావాస పథకం, సమీకృత వృద్ధుల సంక్షేమ పథకం నుంచి జిల్లాలోని ఎన్జీవోలకు సహాయం మంజూరి కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళాలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కామారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. అర్హులైన వారు సెప్టెంబర్ 16లోగా తమ దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా సంక్షేమ శాఖ రూం నెంబర్ 31లో సమర్పించాలని కోరారు.

News August 29, 2024

మహబూబాబాద్: నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

image

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో తీవ్ర విషాదం జరిగింది. గూడూరు మండలం పడమటి తండా గ్రామ శివారు భాగ్య తండాకు చెందిన మూడేళ్ల చిన్నారి గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. చిన్నారి మృతితో భాగ్య తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 29, 2024

పాత పెన్షన్ విధానం అమలు చేయాలి..చిన్నారెడ్డికి వినతి

image

రాష్ట్రంలో కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి గురువారం TSCPSEU ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించలేదని ఈ ప్రభుత్వంలోనైనా డిమాండ్ల సాధనకు కృషి చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా చూడాలని చిన్నారెడ్డిని కోరారు.

News August 29, 2024

నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి అడ్మిషన్

image

నర్సంపేట పట్టణంలో ఈ ఏడాది ప్రారంభమైన ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్‌ను రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శుభోధ్ శర్మ తీసుకున్నారు. కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థికి జాయినింగ్ లెటర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గురువారం అందజేశారు. ఎంబీబీఎస్‌లో 50 సీట్లతో ఈ ఏడాది తరగతులను నిర్వహించనున్నారు. విభాగాధిపతులు పరశురాం, గిరిధర్, దామోదరి, శ్రీదేవి, కేశవ్, తదితరులున్నారు.