Telangana

News August 24, 2024

ఉత్తర తెలంగాణకు ఎంజీఎం పెద్ద దిక్కు!

image

వరంగల్ ఎంజీఎం ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంది. రోజూ సగటున ప్రతి 30 సెకండ్లకు ఒక రోగి ఇక్కడ చేరుతున్నాడు. కరోనా సమయంలో లక్ష మంది రోగులకు సేవలు అందించారు. ఇది 1954లో ప్రారంభం కాగా.. 70 ఏళ్లలో 7,12,92,000 మంది రోగులకు వైద్య సేవలు అందించింది. ఇక్కడ మొత్తం 25 వైద్య విభాగాలు ఉన్నాయి. ప్రతిరోజు సేవలకు ఎంజీఎం చేసే ఖర్చు రూ.1.75 కోట్లు. ఇవీ ఎంజీఎం విశేషాలు.

News August 24, 2024

నల్గొండ: కార్మికులు భద్రమేనా!

image

అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో ఇటీవల పేలుడు సంభవించి 17 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రతపై ఆందోళన నెలకొంది. చౌటుప్పల్, బీబీనగర్, BNR, బొమ్మలరామారం, పోచంపల్లి, త్రిపురారం, MLGలో సుమారు 100 వరకు ఫార్మా పరిశ్రమలున్నాయి. ప్రమాదాలు జరగకముందే కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

News August 24, 2024

ఖమ్మం: గుప్తనిధుల తవ్వకాలు.. నిందితులు ఆరెస్ట్

image

చంద్రుగొండ మండలం ఇమ్మడి రామయ్య బంజర్‌లో గుప్తనిధుల తవ్వకాలు జరిపిన 9మందిని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియా ముందు హాజరు పరిచారు. అయ్యన్నపాలెంకి చెందిన బేతి నీలయ్య జామాయిల్ తోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ దామరచర్లకి చెందిన కర్రి రామకృష్ణ, నీలయ్యకు చెప్పాడు. పూజలు జరిపి తవ్వేందుకు ఖమ్మం జిల్లా కారేపల్లి, ఏపీలోని విస్సన్నపేటకు చెందిన వారిని తీసుకొచ్చాడని డీఎస్పీ చెప్పారు.

News August 24, 2024

నేడు కరీంనగర్‌లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు

image

కరీంనగర్ జిల్లా స్థాయి యోగాసనా పోటీలు నేడు ఉదయం 10:30 గంటలకు డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యోగ క్రీడాకారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

News August 24, 2024

సికింద్రాబాద్: ‘మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు’

image

మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News August 24, 2024

సికింద్రాబాద్: ‘మంకీ ఫాక్స్ గాలిలో వ్యాప్తి చెందదు’

image

మంకీ ఫాక్స్ వ్యాప్తిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీ ఫాక్స్ కేవలం ఆ రుగ్మత కలిగిన వారిని తాకినవారికి మాత్రమే సోకే అవకాశం ఉంటుందని, గాలిలో వ్యాప్తి చెందదని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ ఫాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News August 24, 2024

కవితతో హరీశ్ రావు ములాఖత్

image

తిహార్‌ జైల్‌లో MLC కవితతో MLA హరీశ్‌రావు భేటీ అయ్యారు. శుక్రవారం ములాఖత్‌‌లో భాగంగా జైల్‌లో కవితను కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను ED అరెస్ట్‌ చేయగా, ఆ తర్వాత CBI అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఆమె జైలులో ఉన్నారు.

News August 24, 2024

ఖమ్మం జిల్లాలో హైడ్రా ఏర్పాటు దిశగా అడుగులు..!

image

ఇప్పుడు ఎక్కడ చూసిన హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే HYDలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఖమ్మం జిల్లాలో కూడా హైడ్రా ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కొలనులు, డ్రైనేజి కాలువలను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన భవనాలపై చర్యలు తీసుకుంటుందని సమాచారం. దీంతో అక్రమార్కులు భయాందోళనకు గురవుతున్నారు.

News August 24, 2024

NRPT: ‘సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు’

image

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్స్‌అప్ తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ మీడియాపై ఐటి సెల్ విభాగం 24 గంటల నిఘా పెడుతుందని అన్నారు.

News August 24, 2024

కడెం ప్రాజెక్టును సందర్శించిన అధికారులు

image

కడెం ప్రాజెక్టును మెకానికల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యానంద్, డీఈ కరుణాకర్ శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు వరద గేట్ల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పలు గేట్లను ఎత్తి చూసి ప్రాజెక్ట్ అధికారులకు గేట్లు ఎత్తే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం మెకానికల్ విభాగంలో ఉన్న పలు పరికరాలను పరిశీలించారు.