India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,44,198 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.76,932, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.51,180, అన్నదానానికి రూ.16,086 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ఓటరు జాబితా సవరణ పై రెవెన్యూ అధికారులతో మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుడు, BRS నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పాత్ర పోషించారు. గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం చేశారు. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని ప్రధాన డిమాండ్‌తో, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల, సంయుక్త సమావేశం నిర్వహించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆగస్టుతో దాదాపు వరినాట్లు పూర్తవుతాయి. అయితే సాగుకు సంబంధించిన వివరాలను వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆహార, వాణిజ్య పంటలసాగు 12,35,875 ఎకరాలు, ఉద్యాన పంటల సాగువిస్తీర్ణం 1,96,204 ఎకరాలు, అటవీభూమి విస్తీర్ణం 6,26,025 ఎకరాలు, మొత్తం రైతులు 6,41,612 ఉన్నట్లు తెలిపారు.

ఈనెల 27న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల కేంద్రంలోని భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను సందర్శించనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా 3 రోజులపాటు చారిత్రక కట్టడాలను సందర్శించనున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి జయశంకర్ జిల్లా గణపురం మండలం కోటగుళ్లలో గవర్నర్ పర్యటన కొనసాగనుంది.

స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా HYDలోని శాసనసభ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుష్పాంజలి ఘటించారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఆంగ్లేయ సాయుధ బలగాలకు గుండెలు చూపిస్తూ ధైర్యం ఉంటే కాల్చుకోండి అని సింహంలా గర్జించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన శ్రీ ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం ఉత్పత్తుల ధరలు క్రింది విధంగా ఉన్నాయి.
✓ ధాన్యం(JSR): గరిష్ఠం: 3414. కనిష్ఠం: 2721.
✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2678. కనిష్ఠం: 2459.
✓ పత్తి: గరిష్ఠం: 7361. కనిష్ఠం: 4000.
✓ పేసర్లు: గరిష్ఠం: 6689. కనిష్ఠం: 3465.
✓ మక్కలు: గరిష్ఠం: 2406. కనిష్ఠం: 2406.
✓ పసుపు(గోల): గరిష్ఠం: 12,213. కనిష్ఠం: 12,213.
✓ పల్లికాయ: గరిష్ఠం: 2911. కనిష్ఠం: 2911.
Sorry, no posts matched your criteria.