Telangana

News August 20, 2024

MBNR: పరీక్ష పెట్టారు.. ఏడాదైనా బహుమతులు రాలే !

image

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ పేరుతో గతేడాది జూలై 2, 3, 4, 8, 9తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. కానీ ఈరోజు వరకు పరీక్షలో గెలుపొందిన వారి వివరాలు ప్రకటించలేదు. ఈ పరీక్షలో మొదటి బహుమతిగా ల్యాప్టాప్, రెండో బహుమతిగా స్మార్ట్ ఫోన్, మూడో బహుమతిగా టాబ్లెట్, ప్రతి నియోజకవర్గంలో మహిళ టాపర్‌కు స్కూటీ ప్రకటించారు.

News August 20, 2024

ఖమ్మం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి 

image

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

News August 20, 2024

నవబ్రహ్మ ఆలయాలపై కేంద్ర బృందం రీసర్చ్ !

image

7వ శతాబ్దాలనాటి అలంపూర్ నవబ్రహ్మ ఆలయాలపై ఆర్కియాలజికల్ కేంద్ర అధ్యయన బృందం మంగళవారం అలంపూర్ సందర్శించింది. ఆర్కియాలజికల్ ప్రొఫెసర్ మహాలక్ష్మీ బృందం నవబ్రహ్మ ఆలయాలను సందర్శించి ఇక్కడి అర్కిటెక్చర్, శాసనాలు సంస్కృతి సాంప్రదాయాలపై అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో అలంపూర్ ఆలయాలు సంతృప్తినిచ్చాయన్నారు. ఈవో పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఉన్నారు.

News August 20, 2024

బస్సులో ప్రసవం.. కండక్టర్, నర్సుపై ప్రశంసల వెల్లువ❤

image

బస్సులో ప్రయాణం చేస్తుండగా గర్భిణి సంధ్యకు కండక్టర్, నర్సు ప్రసవం చేశారు. దీంతో మంత్రి పొన్నం, RTC ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. అభినందించారు. ఈ సందర్భంగా కండక్టర్ భారతి మాట్లాడుతూ.. జీవితంలో ఈ ఘటన గుర్తుండిపోతుందని, స్టాఫ్ నర్సు అలివేలు మాట్లాడుతూ.. కాన్పు చేసేందుకు గ్లాసులు లేకపోయినా వెనకాడ లేదని, పాప తల, మెడకు పేగు చుట్టుకొని ఉంది. జాగ్రత్తగా తీసి సుఖ ప్రసవం చేశామన్నారు.

News August 20, 2024

చండ్రుగొండ: ‘అప్పు చేసి డబ్బు కట్టాను.. మాఫీ చేయండి’

image

రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాలని చండ్రుగొండ మండలం మంగయ్య బంజరకు చెందిన రైతు మాలోతు లింగ్యా అన్నారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో జరిగిన రైతు నేస్తంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలే రైతుబంధు రాక అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టానని, మాఫీ అవుతుందన్న ఆశతో రూ.2 లక్షలపై మొత్తాన్ని అప్పు చేసి కట్టానని వాపోయారు.

News August 20, 2024

రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చెందవద్దు అని కోరారు. రైతు రుణమాఫీ అందరికీ  చేస్తామని తెలిపారు. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే మండల కార్యాలయాల్లో, వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని కోరారు.

News August 20, 2024

సిద్దిపేటలో కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తలపెట్టిన ర్యాలీకి ఉమ్మడి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు వాహనాలలో సిద్దిపేటకు బయలుదేరారు. మరోవైపు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

News August 20, 2024

HYD: సీఎంకు దండం పెడుతున్నా: మోత్కుపల్లి

image

SC వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆనందదాయకమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సనత్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనా విధానం అమలయ్యేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని, వయసులో నేను పెద్దవాడిని అయిన సీఎంకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా అన్నారు.

News August 20, 2024

వరంగల్: క్వింటా మక్కలు రూ.2,780

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరల రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు నెలలుగా మొక్కల ధరలు భారీ ధర పలుకుతున్నాయి. నేడు మార్కెట్‌కు మొక్కజొన్న తరలిరాగా ధర క్వింటాకు రూ.2,780 పలికింది. దీంతో మక్కలు పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News August 20, 2024

ప్రాణ, ఆస్తి నష్టం వంటివి వాటిల్లకుండా చూడాలి: కలెక్టర్

image

భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం వంటివి వాటిల్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ వర్షపు జలాలు రహదారుల పై నుండి ప్రవహించే సమయాలలో లెవెల్ వంతెనలు, కాజ్ వేలు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల మీదుగా రాకపోకలను నిషేధిస్తూ, ఇతర ప్రాంతాల మీదుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు.