Telangana

News August 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓మధిర నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
✓ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓భద్రాచలంలో అటవీ శాఖ సంస్థ చైర్మన్ పోదెం వీరయ్యకు సన్మాన కార్యక్రమం
✓పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News August 22, 2024

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన చికెన్ ధరలు

image

నగరంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం కేజీ చికెన్ రూ. 160(స్కిన్‌లెస్) చొప్పున విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు‌ మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గురువారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 187, స్కిన్‌లెస్ ధర రూ. 213, ఫాంరేటు రూ. 107, రిటైల్ రూ. 129గా ఉంది. శ్రావణ మాసం తొలివారానికి, ఈ రోజు పోల్చితే కేజీకి ఏకంగా రూ. 40 పెరగడం గమనార్హం.SHARE IT

News August 22, 2024

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన చికెన్ ధరలు

image

నగరంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం కేజీ చికెన్ రూ. 160(స్కిన్‌లెస్) చొప్పున విక్రయించారు. ఇక నిన్నటి నుంచి మాంసం ధరలు‌ మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గురువారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 187, స్కిన్‌లెస్ ధర రూ. 213, ఫాంరేటు రూ. 107, రిటైల్ రూ. 129గా ఉంది. శ్రావణ మాసం తొలివారానికి, ఈ రోజు పోల్చితే కేజీకి ఏకంగా రూ. 40 పెరగడం గమనార్హం.
SHARE IT

News August 22, 2024

శాండ్ టాక్స్ ద్వారానే బుక్ చేసుకోవాలి: కలెక్టర్

image

ఇసుక అవసరమైన వారు శాండ్ ట్యాక్స్ ద్వారా బుక్ చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన నల్లగొండ నుంచి గుర్రంపోడు వెళ్తూ మార్గమధ్యలో మావిళ్లగూడెం, పర్వతగిరి గ్రామాల మధ్య వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపి అనుమతులు, లైసెన్స్, తదితర రశీదులను తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

News August 22, 2024

NZB: పెరుగుతున్న జ్వర బాధితులు

image

ప్రభుత్వ ఆసుపత్రులు జ్వరాల బారినపడిన వారితో కిటకిటలాడుతున్నాయి. డెంగీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జనరల్ హస్పిటల్లో ఓపీ 2 వేలు దాటుతోంది. పీహెచ్సీలు, సీహెచ్సీల్లోనూ ఓపీ పెరిగింది. 3నెలల్లో డెంగీ కేసుల పెరుగుదల ఇలా ఉంది. జూన్లో 13, జులై72, ఆగస్టు 133 కేసులు నమోదయ్యాయి. GGHలో జూన్లో 47230 ఓపీ, 3470 ఐపీ, జులైలో 62124 ఓపీ, 3636 ఐపీ, ఆగస్టులో 37516 ఓపీ, 2381 ఐపీలున్నాయి.

News August 22, 2024

పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విన్నర్‌గా వరంగల్ యువతి

image

దేశాయిపేట శివారు లక్ష్మిటౌన్‌ షిప్‌కు చెందిన దీక్షిత పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఈనెల 14 నుంచి 17 వరకు HYDకు చెందిన మాంటి ప్రొడక్షన్‌ సంస్థ మిస్టర్‌ అండ్‌ మిస్‌ గార్జియస్‌ ఆఫ్‌ ఇండియా (సీజన్‌-4) పోటీలను నిర్వహించింది.క్యాన్సర్‌ బాధితులకు ఫడ్‌ రేసింగ్, మహిళలు క్యాన్సర్‌ బారిన పడకుండా ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలపై చేసిన సూచనలకు పీపుల్స్‌ ఛాయిస్‌ టైటిల్‌ దక్కినట్లు ఆమె తెలిపారు.

News August 22, 2024

ఇల్లెందు: పెద్దల సమక్షంలో ప్రేమవివాహం

image

కొత్తగూడెంకు చెందిన నాగభవాని,ఇల్లెందు ఇందిరానగర్ కు చెందిన ప్రశాంత్ బుధవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లికి గతంలో పెద్దలు మాట్లాడుకున్నారు. కానీ పెళ్లి కుదరలేదు. ఆ తర్వాత నాగభవాని, ప్రశాంత్ ప్రేమించుకున్నారు. స్నేహితుల సహకారంతో బుధవారం వారు నాయకులగూడెం శ్రీకృష్ణుడి ఆలయంలో గ్రామపెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

News August 22, 2024

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు UPDATES

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రానికి 57, 500 క్యూసెక్కులకు ఇన్ ఫ్లో పెరిగిందని, 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గేట్ల ద్వారా 20,760, విద్యుదుత్పత్తి నిమిత్తం 39,442 క్యూసెక్కులు.. ప్రాజెక్టు నుంచి మొత్తం 62,264 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.296 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

News August 22, 2024

గుణాత్మక విద్యపై అధికారులతో కలెక్టర్ సమావేశం

image

నియోజక వర్గాల వారిగా ఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో కనీసం 50 శాతం మంది విద్యార్థులు 10కి10 జీపీఏ సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఉదయాదీత్య భవన్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్యపై జిల్లా అధికారులు, సంబంధిత ఎంఈఓ, హెచ్ఎం, టీచర్లతో సమావేశం నిర్వహించారు.

News August 22, 2024

ఖమ్మం జిల్లాలో అంతులేని రోగాలతో ఇబ్బందులు

image

సాధారణంగా జ్వరం లక్షణాల ఆధారంగా అది ఏరకమో వైద్యులు అంచనాకు వస్తారు. జ్వరంతోపాటు కీళ్ల నొప్పులుంటే డెంగ్యూ, శరీరంపై దద్దుర్లుంటే గన్యా,తీవ్రమైన జ్వరమైతే మలేరియా, టైఫాయిడ్ అని ప్రాథమికంగా భావిస్తారు. కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో ప్రబలుతున్న జ్వరాలు వైద్యులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. వైరస్ కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని గుర్తించినా వ్యాధి కారక వైరస్ ఏంటనేది తెలియడం కష్టంగా మారుతోంది.